Begin typing your search above and press return to search.

'క‌థానాయ‌క‌' సిస‌లైన కానుక‌

By:  Tupaki Desk   |   2 Dec 2018 9:44 AM IST
క‌థానాయ‌క‌ సిస‌లైన కానుక‌
X
విశ్వ‌విఖ్యాత న‌ట‌సార్వ భౌముడు - అన్న‌గారు ఎన్టీఆర్ జీవితంపై రెండు భాగాలుగా బ‌యోపిక్ తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. జాగ‌ర్ల‌మూడి రాధాకృష్ణ (క్రిష్‌) ఈ రెండు భాగాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. నంద‌మూరి బాల‌కృష్ణ ఎన్‌ బీకే ఫిలింస్ ఎల్ ఎల్‌ పీ ప‌తాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వారాహి చ‌ల‌న‌చిత్రం- విబ్రి మీడియా సంస్థ‌లు ఎన్‌ బీకే ఫిలింస్‌ తో క‌లిసి పెట్టుబ‌డులు స‌మ‌కూరుస్తున్నాయి. జ‌న‌వ‌రి 9న క‌థానాయ‌కుడు - జ‌న‌వ‌రి చివరివారంలో మ‌హానాయ‌కుడు పేరుతో ఈ చిత్రాల్ని రిలీజ్ చేస్తున్నారు. క‌థానాయ‌కుడు రిలీజ్‌కి ఇంకో 40 రోజులే టైమ్. ఇక‌మీద‌ట ప్ర‌చారం ప‌రంగా మ‌రింత వేగం పెంచేందుకు టీమ్ ప‌నుల్ని స్పీడ‌ప్ చేస్తోంది. ఇప్ప‌టికే తెలుగు మీడియాలో ఈ సినిమాకి 2.0ని మించిన ప్ర‌మోష‌న్ ద‌క్కిందంటే అతిశ‌యోక్తి కాదు.

తాజాగా ఈ సినిమా నుంచి `క‌థానాయ‌క...` అంటూ సాగే టైటిల్ సాంగ్‌ ని రిలీజ్ చేసింది యూనిట్‌. ఘ‌న‌కీర్తి సాంద్ర విజితాఖిలాంద్ర జ‌న‌తా సుధీంద్ర మ‌ణిదీప‌కా.. ఘ‌న‌కీర్తి సాంద్ర విజితాఖిలాంద్ర జ‌న‌తా సుధీంద్ర మ‌ణిదీప‌కా త్రిష‌త‌కాధికా చిత్ర‌మాలికా.. జైత్ర‌యాత్రికా.... క‌థానాయ‌క‌` అంటూ సాగే మెలోడీని మ‌ర‌క‌త‌మ‌ణి ఎం.ఎం.కీర‌వాణి సృజించిన తీరు ఆక‌ట్టుకుంది. ఈ మెలోడీకి కీర‌వాణి అద్భుత‌మైన బాణీని అందించారు. ఈ పాట‌ను ప్ర‌ఖ్యాత గాయ‌కుడు కైలాస్ ఖేర్ ఆల‌పించిన తీరు అద్భుతం. శివ‌శ‌క్తి ద‌త్తా - రామ‌కృష్ణ ఈ లిరిక్‌ ని ర‌చించారు. పాట ఆద్యంతం పురాణ పురుషుల పేర్ల‌ను.. మ‌హాభార‌తం పాండ‌వుల పేర్ల‌ను ప్ర‌స్థావించారు. క‌థానాయ‌కుడిగా అన్న‌గారి చ‌రిత్ర‌ను - ఆయ‌న పాత్ర‌లను ప్ర‌స్థావిస్తూ పాట‌ను ర‌చించారు.

క‌థానాయ‌క గీతం లెజెండ్ ఎన్టీఆర్‌ కి ఇచ్చిన అద్భుత‌మైన కానుక అంటే అతిశ‌యోక్తి కాదు. అంత అద్భుతంగా ట్యూన్ కుదిరింది. కీర‌వాణి బాణీలో యుద్ధ స‌న్నాహ‌కం క‌నిపించింది. ఈ పాట ముగింపు విజువ‌ల్‌ లో అన్న‌గారు వీర‌ర‌సం ఒలికిస్తూ ఉన్న గెట‌ప్‌ని ఆవిష్క‌రించిన తీరు అభిమానుల‌కు సిస‌లైన‌ కానుక అనే చెప్పాలి. ఈ లిరిక‌ల్ సాంగ్ పెద్ద స‌క్సెస్. మునుముందు ఈ చిత్రంలోని మ‌రిన్ని పాట‌ల్ని రివీల్ చేయ‌నుంది ఎన్టీఆర్ టీమ్.