Begin typing your search above and press return to search.

వీడియో: క‌థ వెనుక క‌థ .. క‌థ కొట్టేశారంటూ గొడ‌వ‌

By:  Tupaki Desk   |   11 March 2023 11:46 PM
వీడియో: క‌థ వెనుక క‌థ .. క‌థ కొట్టేశారంటూ గొడ‌వ‌
X
నా క‌థను నాకు తెలియ‌కుండా కాపీ కొట్టేశారంటూ ఫిలింన‌గ‌ర్ -యూస‌ఫ్ గూడ ఫిలింఆఫీసుల్లో ర‌చ‌యిత‌లు గొడ‌వ‌ల‌కు దిగిన సంద‌ర్భాలెన్నో. సినిమా పూర్త‌య్యాక‌ టీజ‌ర్ లేదా ట్రైల‌ర్ చూసి ఇది అచ్చంగా నా క‌థ‌లాగే ఉంది. నేను ఫ‌లానా నిర్మాత‌కు క‌థ చెప్పాన‌ని లేదా ఫ‌లానా హీరో డైరెక్ట‌ర్ కి క‌థ వినిపిస్తే యాజ్ టీజ్ గా కాపీ కొట్టేసి సినిమా తీసేశార‌ని ' 'క‌థ‌కు సంబంధించిన క్రెడిట్ త‌న‌కు ఇవ్వ‌లేదు ' ' అని గోడు వెల్ల‌బోసుకునే ర‌చ‌యిత‌లకు కొద‌వేమీ లేదు. ఈ త‌ర‌హా మోసాలు సినీప‌రిశ్ర‌మ‌కు మాయ‌ని మ‌చ్చ‌గా మారాయి.

అయితే ఎవ‌రైనా ఒక క‌థ‌ను రాసిన త‌ర్వాత దానిని ర‌చ‌యిత‌ల సంఘంలో రిజిస్ట‌ర్ చేయించుకుంటే చ‌ట్ట‌ప‌రంగా కోర్టుల ప‌రిధిలో పోరాటం చేసేందుకు వీలుంది. కానీ కొంద‌రు త‌మ క‌థ‌ను కాపీ కొట్టార‌ని తెలియ‌గానే ఆవేశంగా స‌ద‌రు నిర్మాత ఆఫీస్ కి వెళ్లి గొడ‌వ చేయ‌డం రివాజుగా మారింది. అలాంటి ఒక గొడ‌వ‌ను ఎదుర్కొంది 'క‌థ వెనుక క‌థ ' చిత్ర‌బృందం. ఆఫీస్ ఎదుటే ద‌ర్శ‌క‌హీరోలు నిర్మాత‌ల‌ను అట‌కాయించి ర‌చ‌యిత దాడికి దిగారు. అయితే ఇది సినిమా ప‌బ్లిసిటీ కోసం రూపొందించిన వీడియో అని స్ప‌ష్ఠంగా అర్థ‌మ‌వుతోంది. కాపీ క్యాట్ గొడ‌వ‌లు ఎలా ఉంటాయో క‌ళ్ల‌కు గ‌ట్టేలా నేచుర‌ల్ గా వీడియోని రూపొందించే ప్ర‌య‌త్నం చేసింది చిత్ర‌బృందం.

విశ్వంత్ దుడ్డుంపూడి- శ్రీజితా ఘౌష్- శుభశ్రీ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన థ్రిల్లర్ చిత్రం 'క‌థ వెనుక క‌థ‌ '. కృష్ణ చైతన్య ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. దండమూడి బాక్సాఫీస్ ప‌తాకంపై దండమూడి అవనీంద్ర కుమార్ నిర్మించారు. ఇటీవ‌ల‌ గోపీచంద్ మలినేని చేతుల మీదుగా టీజర్ విడుదలై ఆక‌ట్టుకుంది. సస్పెన్స్ థ్రిల్లర్ క‌థాంశంతో అరుదైన లొకేష‌న్ల‌లో చిత్రీకరించార‌ని స‌మాచారం.

క‌థానుసారం... ఏడాది కాలంగా తప్పిపోయిన పలువురు బాలికలు ఒకరి తర్వాత ఒకరుగా చనిపోతారు. మర్డర్ మిస్టరీని ఆవేశపూరితమైన- చురుకైన- తెలివైన పోలీసు (సునీల్) ఎలా ఛేదించాడు? అన్న‌ది తెర‌పైనే చూడాలి. ఈ హత్యల వెనుక ఓ ముఠా హ‌స్తం ఏమిటీ? విశ్వంత్ పాత్ర లో స‌స్పెన్స్ ఎలిమెంట్ ఏమిటి? అన్న‌ది తెర‌పైనే చూడాలి. నిర్మాత దండమూడి అవనీంద్ర కుమార్ మేకింగ్ వాల్యూస్ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా సినిమాను నిర్మించారు. స్క్రీన్ ప్లే బేస్డ్ థ్రిల్లర్ ని ప్రతిష్టాత్మకంగా రూపొందించారు. మూవీ ఆడియో ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదల కానుంది. విశ్వంత్ దుడ్డుంపూడి- శ్రీజిత ఘౌష్- శుభశ్రీ-అలీ- సునీల్- జయ ప్రకాష్- బెనర్జీ-రఘుబాబు-సత్యం రాజేష్- మధు నందన్- భూపాల్- ఛత్రపతి శేఖర్- ఖయ్యూం-ఈ రోజుల్లో సాయి- రూప త‌దిత‌రులు న‌టించారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.