Begin typing your search above and press return to search.

ఓపెన్‌ గా ఒప్పుకోవడం గ్రేటే

By:  Tupaki Desk   |   1 Jan 2016 11:00 PM IST
ఓపెన్‌ గా ఒప్పుకోవడం గ్రేటే
X
మామూలుగా సినిమా హీరోయిన్లంటే.. బయటెక్కడ చూసినా కూడా రచ్చ రచ్చ లుక్స్‌ తో ఇరగదీస్తారని చాలామంది ఫీలింగ్‌. కాని మొన్న ఇండోనేషియాలో హాలిడేయింగ్‌ చేస్తున్న కాజల్‌ అగర్వాల్‌.. అలాగే ఇతర దేశాల్లో న్యూ ఇయర్‌ సెలబ్రేట్‌ చేసుకున్న స్టార్‌ హీరోయిన్ల మేకప్ లెస్‌ ఫోటోలు చూసి అందరూ షాకయ్యారు. ఈ భామలు కూడా సాధారణ అమ్మాయిల్లానే ఉన్నారంటూ నోరెళ్ళబెట్టారు.

ఆ టైపులో థింక్‌ చేసి తెగ ఫీలైపోతున్న జనులందరికీ.. ఇప్పుడు టైటానిక్ భామ కేట్ విన్‌స్లెట్ (40) ప్రపంచానికి ఓ బ్రహ్మాండమైన నిజం చెప్పింది. మెరిసే కళ్లతో, అద్భుతమైన అందంతో అందరినీ ఆకట్టుకున్న ఈ భామ యువతులకు ఆసక్తికరమైన సందేశాన్నిస్తోంది. వెండితెర మీద, అవార్డు ఫంక్షన్లలోను కళ్లు చెదిరే అందంతో అందరినీ ఆకట్టుకునే తమలాంటి సెలబ్రిటీలు.. ఎప్పుడూ అంత అందంగా ఉంటారన్న భ్రమలు పెట్టుకోవద్దని తెలిపింది. ప్రొఫెషనల్‌ లైఫ్‌ లో భాగంగా అలా మేకప్ సహాయంతో ఎంతో అందంగా కనిపిస్తామే కాని.. రియల్‌ లైప్‌ లో మాత్రం యావరేజ్‌ గానే ఉంటాం అంటూ చెప్పేసింది.

సో.. అర్ధమైంది కదా బాబులూ. ఏదేమైనా కేట్‌ విన్స్‌ స్లెట్‌ అలా ఓపెన్‌ గా ఒప్పుకోవడం గ్రేటే.