Begin typing your search above and press return to search.

సంకురాత్రి కాటమరాయుడు ఎలా ఉన్నాడంటే..

By:  Tupaki Desk   |   13 Jan 2017 4:02 PM GMT
సంకురాత్రి కాటమరాయుడు ఎలా ఉన్నాడంటే..
X
ఆల్రెడీ కాటమరాయుడి వాకింగ్ లుక్.. బ్యాక్ లుక్.. సిట్టింగ్ లుక్ చూశాం. ఇప్పుడు సంక్రాంతి లుక్ బయటికి వచ్చేసింది. ముందుగా అనుకున్నట్లు టీజర్ లాంచ్ తంతును రద్దు చేసి.. సంక్రాంతి కానుకగా ఓ డిజిటల్ పోస్టర్ రిలీజ్ చేయడానికి ‘కాటమరాయుడు’ టీం నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. సంక్రాంతి పండుగను దృష్టిలో ఉంచుకుని ‘కాటమరాయుడు’ కొత్త పోస్టర్ ను ఆకర్షణీయంగా తీర్చిదిద్దింది చిత్ర యూనిట్. పంచె కట్టులో ఎడ్లబండి దగ్గర నిలుచున్న పవన్ సరికొత్తగా దర్శనమిస్తున్నాడు.

ఎప్పుడూ చాలా మోడర్న్ గా కనిపించే పవన్.. ఇలా పంచెకట్టులో సంక్రాంతి బుల్లోడిలా తయారవడం కొత్తగా అనిపిస్తోంది. ఇప్పటిదాకా రిలీజ్ చేసిన పోస్టర్లన్నింట్లోకి ఇది ది బెస్ట్ అనొచ్చు. ‘కాటమరాయుడు’లో రాయలసీమ ఫ్యాక్షనిస్టు పాత్రను పోషిస్తున్నాడు పవన్. సినిమా అంతటా పంచెకట్టులోని దర్శనమివ్వబోతుండటం విశేషం. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రం మార్చి నెలాఖర్లో ఉగాది కానుకగా రిలీజవుతుంది. డాలీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో పవన్ సరసన శ్రుతి హాసన్ నటించబోతోంది. శరత్ మరార్ నిర్మాత. అనూప్ రూబెన్స్ సంగీత దర్శకుడు.