Begin typing your search above and press return to search.

కాటమరాయుడికి అత్తారింటికి లింక్

By:  Tupaki Desk   |   22 Sept 2016 4:32 PM IST
కాటమరాయుడికి అత్తారింటికి లింక్
X
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త సినిమా స్టార్ట్ చేసేందుకు మరో రెండు రోజులు గడువు మాత్రమే ఉంది. సెప్టెంబర్ 24న కాటమరాయుడు షూటింగ్ ప్రారంభం కానుండగా.. తొలి రోజు నుంచే పవన్ కూడా భాగం కానున్నాడని అంటున్నారు. డాలీ డైరెక్షన్ లో తెరకెక్కనున్న ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. రావు రమేష్.. అభిమన్యు సింగ్ లు కీలకపాత్రలు పోషించనున్నారు.

రెండు రోజుల్లో షూటింగ్ ప్రారంభం కానుండగా.. కాటమరాయుడు టెక్నికల్ టీమ్ లో కీలకమైన మార్పు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి తమిళ్ సినిమాటోగ్రాఫర్ సౌందరరాజన్ కెమేరా వర్క్ చూసుకుంటాడని ఇన్నాళ్లు అనుకున్నారు. కానీ ఇప్పుడు పవన్ లేటెస్ట్ మూవీకి ప్రసాద్ మూరెళ్లను సినిమాటోగ్రాఫర్ గా ఫైనల్ చేశారు. ఈయన అత్తారింటికి దారేది చిత్రానికి పవన్ తో కలిసి పని చేసిన అనుభవం ఉంది.

అయితే.. కాటమరాయుడు షూటింగ్ ఆలస్యం కావంతో.. వేరే సినిమాల డేట్స్ తో క్లాష్ వచ్చే పరిస్థితి సౌందర రాజన్ కి ఏర్పడిందట. అందుకే తప్పుకుంటున్నాడని తెలుస్తోంది. సరిగ్గా షూటింగ్ స్టార్ట్ అయ్యేముందు చోటు చేసుకున్న ఈ మార్పు అందరినీ ఆశ్చర్యపరిచింది. గతంలో ఈ సినిమాకి దర్శకుడు మారిన సంగతి తెలిసిందే. ఎస్ జే సూర్యను మొదట డైరెక్టర్ అనుకోగా.. ఇప్పుడా బాధ్యతలను డాలీ నిర్వహిస్తున్నాడు.