Begin typing your search above and press return to search.

అంత సీరియస్ ఎందుకు కాటమరాయుడు??

By:  Tupaki Desk   |   1 Jan 2017 11:20 AM GMT
అంత సీరియస్ ఎందుకు కాటమరాయుడు??
X
ఆల్రెడీ గత మూడు రోజుల నుండి కాటమరాయుడు తన టీజర్ పోస్టర్లతో దంచికొడుతున్నాడు. అయితే ఊహించని రేంజులో ఇప్పుడు ఒక వర్కింగ్ వీడియోను రిలీజ్ చేసి ఫ్యాన్స్ ను ఫుల్ ఖుషీ చేశాడు పవర్ స్టార్. కాని అక్కడే ఓ విషయం చెప్పుకోవాలి మనం.

నిజానికి కాటమరాయుడు మేకింగ్ వీడియోలో చాలామంది స్టార్లను మనకు మరోసారి పరిచయం చేస్తూ.. అందరితోనూ హ్యాపీ న్యూ ఇయర్ అంటూ చెప్పించారు. శృతి హాసన్.. డైరక్టర్ డాలీ.. రావు రమేష్‌.. ఆలీ.. అజయ్.. శివ బాలాజీ.. అనూప్ రూబెన్స్.. మొదలగు వారందరూ జనాలకు 2017 బాగా కలిసొస్తుందని.. హ్యాపీ న్యూ ఇయర్ అనీ.. చెప్పారు. అయితే మొత్తం వీడియో పూర్తయ్యాక చివ్వర్లో బాగా సీరియస్ లుక్ తో పవన్ కళ్యాణ్‌ ఎంట్రీ ఇచ్చాడు. ఆయన కూడా నవ్వుతూ న్యూ ఇయర్ విషెస్ చెబుతాడనుకుంటే.. ఫైట్ మాష్టర్లు రామ్-లక్ష్మణ్‌ చెప్పిందేదో వినుకుంటూ పవన్ సీరియస్ గా వెళ్ళిపోయాడు.

మరి అంత సీరియస్ ఎందుకు కాటమరాయుడూ?? కాస్త నవ్వొచ్చుగా నానా!!




Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/