Begin typing your search above and press return to search.

పవన్ కళ్యాణ్ @ రామేశ్వరం

By:  Tupaki Desk   |   2 Oct 2016 11:13 AM GMT
పవన్ కళ్యాణ్ @ రామేశ్వరం
X
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉన్నట్లుండి తమిళనాడు పర్యటన ఎందుకు చేస్తున్నాడు అనుకోకండి. ఆయన షూటింగ్ పని మీదే రామేశ్వరం వెళ్తున్నాడు. వాయిదాల మీద వాయిదాల తర్వాత ఎట్టకేలకు ఓ పది రోజుల ముందే పవన్ కొత్త సినిమా ‘కాటమరాయుడు’ రెగ్యులర్ షూటింగ్ మొదలైన సంగతి తెలిసిందే. హైదరాబాద్ లో చిన్న షెడ్యూల్లో కొన్ని సన్నివేశాలు చిత్రీకరించిన డాలీ అండ్ కో.. తర్వాతి షెడ్యూల్ కోసం లొకేషన్ షిఫ్ట్ అయింది. అక్టోబరు 5 నుంచి రామేశ్వరంలో కొత్త షెడ్యూల్ ప్లాన్ చేసింది. ఈ షెడ్యూల్ ఎక్కువ రోజులే సాగుతుందని సమాచారం.

తెలుగు రాష్ట్రాల్లోని ఏ గుడికి వెళ్లినా షూటింగుకి ఇబ్బందులు తప్పవు. అందుకే తమిళనాట ప్రశాంతంగా షూటింగ్ చేసుకుందామని భావించినట్లున్నారు. ఈ షెడ్యూల్ నుంచే హీరోయిన్ శ్రుతి హాసన్ ‘కాటమరాయుడు’ టీంతో జాయిన్ అవుతుంది. పవన్-శ్రుతి కాంబినేషన్లో కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. ఈ సినిమాలో పవన్ తమ్ముళ్లుగా నటిస్తున్న శివబాలాజీ.. కమల్ కామరాజు.. అజయ్ కూడా ఈ షెడ్యూల్ షూటింగులో పాల్గొంటారు. తమిళ హిట్ మూవీ ‘వీరం’కు ఆన్ ఆఫీషియల్ రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని తెలుగు నేటివిటీకి తగ్గట్లు మారుస్తున్నారట. పవన్ మిత్రుడు శరత్ మరార్ నిర్మిస్తున్న ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతాన్నందిస్తున్నాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/