Begin typing your search above and press return to search.

హీరోయిన్ గా మారిన పోలీస్ ఆఫీసర్ కూతురు

By:  Tupaki Desk   |   27 Jun 2018 9:46 AM GMT
హీరోయిన్ గా మారిన పోలీస్ ఆఫీసర్ కూతురు
X
ఫ్యామిలీ లో ఎవరైనా ఇండస్ట్రీకి సంబంధించిన వారుంటే, ఎంట్రీ ఇవ్వడం కొంచెం సులభమే. కానీ అసలు సినిమాలకు ఎంత మాత్రం సంబంధం లేని పోలీస్ డిపార్ట్మెంట్ నుండి సినిమాల్లోకి అడుగుపెట్టడం అంటే విశేషమే. యంగ్ హీరో నాగ శౌర్య రాబోయే సినిమా లో హీరోయిన్ గా నటిస్తున్న కశ్మీరా పర్దేశి పూణే లో పని చేసే ఒక పోలీస్ ఆఫీసర్ కూతురు.

చలో సినిమాలో రష్మీక మందన్నాను తెరపైన పరిచయం చేసిన నాగ శౌర్య ఇప్పుడు నర్తనశాల సినిమా తో కాష్మీరాను మనకు పరిచయం చేయబోతున్నాడు. చలో సినిమాను నిర్మించిన ఇరా క్రియేషన్స్ బ్యానర్ ఈ సినిమాని కూడా నిర్మిస్తోంది. దాదాపు పాటలు మినహాయించి షూటింగ్ అంతా పూర్తయిపోయినట్టే. సంగీత్ సొంగ్ షూటింగ్ సోమవారం నుండి మొదలవనుంది. అన్నపూర్ణ స్టూడియోస్లో ఈపాటకై దాదాపు 50 లక్షలు ఖర్చుపెట్టి సెట్ వేయడం జరిగింది. ఈపాట చిత్రీకరణ పూర్తయిన వెంటనే టీం సభ్యులంతా మరొకరెండు పాటల షూటింగ్ కోసం ఫారిన్ పయణమవ్వనున్నారు.

షూటింగ్ ఒక కొలిక్కి వచ్చాక, జులై అగస్టు నేలలు మొత్తం సినిమా ప్రమోషన్స్ కి మాత్రమే కేటాయించాలని నిర్మాతలు ఫిక్స్ అయ్యారు. ఎంతైనా వారి ముందు చిత్రం చలో విషయంలో కూడా ప్రోమోషన్స్ వలన కాలెక్షన్ల వర్షం బాగానే కురిసింది కదా. ఆగస్టు ఆఖరులో లేదా సెప్టెంబర్12న సినీమ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తెలుగమ్మాయి యామిని భాస్కర్ కూడా ఈ సినిమాతో పరిచయం కానుంది. మణిశర్మ కుమారుడు సాగర్ మహతి ఈ సినిమాకి 5 పాటలకు మంచి ట్యూన్స్ అందించారు.