Begin typing your search above and press return to search.

ఈసారి ఇద్దరు భామలతో..

By:  Tupaki Desk   |   9 Jun 2018 9:55 AM IST
ఈసారి ఇద్దరు భామలతో..
X
హీరోగా.. నిర్మాతగా నాగశార్యకు ఛలో మూవీ కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. వెంకీ కుడుముల డైరెక్టర్ లో కామెడీ ఎంటర్ టెయినర్ గా వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబట్టింది. ఛలో మూవీలో కామెడీ బాగుండటంతోపాటు హీరో నాగశౌర్యం - తెలుగు తెరకు కొత్తగా పరిచయమైన కన్నడ భామ రష్మిక మండన్నల జంట చూడచక్కగా ఉండటం సినిమాకు ప్లస్ పాయింట్ అయింది.

నాగశౌర్య తాజాగా నర్తనశాల సినిమా చేస్తున్నాడు. ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రేమకథగా ఈ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమాతో నాగశౌర్య ఇద్దరు కొత్త బ్యూటీలను టాలీవుడ్ కు పరిచయం చేస్తున్నాడు. కాశ్మీర పరదేశి.. యామిని భాస్కర్ లు ఇందులో హీరోయిన్ లుగా నటిస్తున్నారు. ఇందులో కూడా హీరోతో వీళ్లిద్దరి లుక్ ఫ్రెష గా ఉండి ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని డైరెక్టర్ శ్రీనివాస చక్రవర్తి చెబుతున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపు సగానికి పైగానే పూర్తయిందని తెలుస్తోంది. ఈ ఇద్దరు బ్యూటీలు నర్తనశాల తమ కెరీర్ ను పట్టాలు ఎక్కిస్తుందనే ఆశతో ఉన్నారు.

నర్తనశాల అనే టైటిల్ ను బట్టి ఇది డ్యాన్స్ కు సంబంధించిన సబ్జెక్టుతో తీసిన సినిమా కాదని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. నర్తనశాల ఫుల్ లెంగ్త్ ఎంటర్ టెయినర్ అంటున్నారు. డైరెక్టర్ శ్రీనివాస్ ఇంతకుముందు కృష్ణవంశీ టీంలో పనిచేశాడు. నర్తనశాల సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు.