Begin typing your search above and press return to search.

దర్శకుడి చందమామను అలా వద్దన్నారు

By:  Tupaki Desk   |   13 April 2018 4:35 AM GMT
దర్శకుడి చందమామను అలా వద్దన్నారు
X
సాయి ధరం తేజ్ హీరోగా అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్ గా కరుణాకరన్ దర్శకత్వంలో ఓ రూపొందుతోంది. ట్రెండ్ సెట్టింగ్ సినిమాలు తీయగల ట్యాలెంట్ ఉన్న దర్శకుడిగా గుర్తింపు పొందిన కరుణాకరన్.. టైటిల్స్ విషయంలో కూడా వినూత్నంగానే ఉంటాడు. ఇప్పుడీ సినిమాకు పలు టైటిల్స్ ప్రచారంలో ఉండగా.. మొదటగా వినిపించిన అందమైన చందమామ అందరినీ ఆకట్టుకుంది.

కానీ దర్శకుడు సూచించిన ఈ పేరు విషయంలో.. నిర్మాతతో సహా యూనిట్ సభ్యులు ఎవరూ సంతృప్తిగా లేరని అంటున్నారు. దీనికి కారణం.. ఈ టైటిల్ హీరోయిన్ పేరుపై ఉండడమే. ఈ టైటిల్ కారణంగా ఇది ఫిమేల్ ఓరియెంటెడ్ సబ్జెక్ట్ అనే ఫీలర్ ను జనాలకు ఇచ్చినట్లు అవుతుందని భావిస్తున్నారట. హీరో పేరు మీద సినిమా టైటిల్ ఉండాలని అడుగుతున్నారట. అందరి కంటే ఎక్కువగా నిర్మాతలు ఈ పేరు మార్చాల్సిందే అని పట్టుపట్టడంతో.. ఇతర పేర్లను వెతుకుతున్నట్లు తెలుస్తోంది.

'తేజు ది కూడా ఒక మంచి ప్రేమ కథ'.. 'ఇది తేజు ప్రేమ కథ' అనే టైటిల్స్ ప్రస్తుతం పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే.. తేజు సినిమాకు ఈ టైటిల్స్ కంటే.. ముందుగా వినిపించిన అందమైన చందమామ అన్న పేరే విభిన్నంగా వినూత్నంగా ఉందనే అభిప్రాయాలు వస్తున్నాయి. కానీ హీరో ఓరియెంటెడ్ గా పేరు ఉండాలనే నిర్మాతల పట్టు కారణంగానే.. దర్శకుడు తనకు నచ్చకపోయినా టైటిల్ మారుస్తున్నట్లు చెప్పుకుంటున్నారు.