Begin typing your search above and press return to search.

అటు చేసి ఇటు చేసి ​తొలిప్రేమేనా?

By:  Tupaki Desk   |   21 Aug 2017 9:49 AM IST
అటు చేసి ఇటు చేసి ​తొలిప్రేమేనా?
X
మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ఇప్పుడు ఒక్క కమర్షియల్ హిట్ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ మధ్యనే కరుణాకరన్ డైరక్షన్లో ఒక ప్రేమ కథను చేయడానికి సర్వం సిద్దం చేసుకున్నాడు. పవన్ కల్యాణ్ సినిమాలలోనే పెద్ద హిటైన ‘తొలిప్రేమ’ను డైరెక్ట్ చేసిన కరుణాకరణ్ ఈ కొత్త ప్రాజెక్టును డైరెక్ట్ చేయబోతున్నాడు. ఈ సినిమా గురించి.. సాయి ధరమ్ తేజ్ కారెక్టర్ గురించి.. డైరెక్టర్ కరుణాకరణ్ చెప్పిన అప్డేట్ వింటుంటే.. మనోళ్ళు మళ్ళీ తొలిప్రేమనే తీస్తున్నారని అనుకోవాలి.

''ఈ కొత్త ప్రేమ కథలో సాయి ధరమ్ తేజ్ ముందు సినిమాలు కంటే భిన్నంగా కనిపిస్తాడు. కథాంశంలో కూడా లవ్ అనే ఒక్క దాన్ని గురించే కాకుండా ఫ్రెండ్స్ - ఫ్యామిలి - ఇంకా ఇప్పటి యువకుల ఆలోచనలు చుట్టూ ఉంటుంది. సాయి ధరమ్ తేజ్ ఈ పాత్ర ద్వారా ఫ్యామిలి ప్రేక్షకులకు తెలుగు యూత్ కు మరింత దగ్గరవుతాడు. ఈ సినిమాలో సాయి పాత్ర తొలిప్రేమ సినిమాలో పవన్ కల్యాణ్ పాత్రకు కొనసాగింపు అని అనుకోవచ్చు'' అంటూ చెప్పేశాడు కరుణాకరన్. ఆ లాస్ట్ లైన్ ఏదైతే చెప్పాడో.. అది వింటే.. మనోడు మరోసారి తొలిప్రేమనే తీస్తున్నాడా అనే సందేహం ఎవరికైనా వస్తుంది. 2014 లో వచ్చిన ‘చిన్నదాన నీ కోసం’ తరువాత డైరెక్టర్ కరుణాకరన్ మరే సినిమాను డైరెక్ట్ చేయలేదు. ఇప్పుడు నిర్మించబోతోన్న ఈ స్క్రిప్ట్ కోసం చాలా ఏళ్ళుగా పని చేశాడు అని చెబుతున్నాడు. ఈ కథ పై కూడా మంచి నమ్మకం ఉందని చెబుతున్నాడు. చూద్దాం ఏం చేస్తాడో.

ఇక సాయి ధరమ్ తేజ్ విషయానికొస్తే.. ‘జవాన్’ పోస్ట్ ప్రొడక్షన్ పనులతో సతమతం అవుతున్నాడు. ఈ సినిమా వచ్చే నెల ఒకటన విడుదల కావాలి కానీ కొన్ని ప్రొడక్షన్ పనులు కారణాలు వలన వాయుదా వేశారు. కొత్త డేట్ ఇంకా చెప్పనేలేదు.