Begin typing your search above and press return to search.

పూరీనే బ‌య‌ట‌ప‌డ్డాడు.. నేనెంత‌?

By:  Tupaki Desk   |   31 July 2019 2:30 PM GMT
పూరీనే బ‌య‌ట‌ప‌డ్డాడు.. నేనెంత‌?
X
తొలి ప్ర‌య‌త్న‌మే బ్లాక్ బ‌స్ట‌ర్ కొట్టి మ‌లి ప్ర‌య‌త్నం చ‌తికిల‌బ‌డ్డాడు కార్తికేయ‌. ఆర్.ఎక్స్ 100 విజ‌యం గురించి మాట్లాడుకుంటుండ‌గానే `హిప్పీ`తో ప‌రాజ‌యం ఎదుర్కోవాల్సి వ‌చ్చింది. కొత్త‌గా ప్ర‌య‌త్నించినా అది స‌ఫ‌లం కాలేదు. దాంతో తీవ్ర‌ నిరాశ‌కే గుర‌య్యాడు. ఇదే విష‌యాన్ని `గుణ 369` ఇంట‌ర్వ్యూలో ప్ర‌శ్నిస్తే కార్తికేయ ఇచ్చిన ఆన్స‌ర్ స‌ర్ ప్రైజ్ చేసింది.

``ప్ర‌తి సినిమాకి కొత్త‌గానే వెళ‌తాం. స‌క్సెస్ అయినా అవ్వ‌క‌పోయినా గుణ‌ని మ‌ళ్లీ గుణ‌లానే చూడాలి. హిట్ వ‌స్తే చూసే ప‌ద్ధ‌తి మారుతుంది. గెలుపోట‌ముల‌ ప్ర‌భావం ప్ర‌తి ఒక్కరిపైనా ఉంటుంది. ప్ర‌తి సినిమా ఒక కొత్త జ‌ర్నీ. బావుండ‌క‌పోతే హిట్ చేయ‌రు.. ఫ్లాపైనంత మాత్రాన బాలేద‌నీ కాదు!`` అంటూ త‌న‌దైన శైలిలో ఫిలాస‌ఫీని వ్య‌క్తం చేశారు ఈ యంగ్ హీరో. అంతేకాదు మ‌రో ఆస‌క్తిక‌ర ఎగ్జాంపుల్ ని కార్తికేయ మీడియాకి చెప్పారు.

``రామ్ గారికి ఇటీవ‌ల అస్స‌లు స‌క్సెస్ లేదు. పూరి గారికి లేదు. మొన్న‌నే ఎంతో పెద్ద బ్లాక్ బ‌స్ట‌ర్ వ‌చ్చింది ఆ ఇద్ద‌రికీ. నాకు ఒక సినిమానే. ఎవ‌రైనా తిరిగి కంబ్యాక్ అవ్వొచ్చు`` అంటూ ఆశాభావం వ్య‌క్తం చేశారు. నిర్మాత‌కు డ‌బ్బులు రావ‌డమే ముఖ్యం. ఎంత మంచి సినిమా చేసినా నిర్మాత‌కు డ‌బ్బు రావ‌డ‌మే కిక్కిస్తుంది. వాళ్లు హ్యాపీగా ఉంటే నాకు సంతోషం అని కార్తికేయ అన్నారు. గుణ పాత్ర గురించి చెబుతూ.. ``ఒంగోలులో ఉండే మిడిల్ క్లాస్ అబ్బాయి పాత్ర ఇది. అమ్మ‌.. నాన్న చెల్లి.. ఉంటారు. వీధి చివ‌ర సెల్ ఫోన్ షాప్ లో అమ్మాయిని ప్రేమిస్తాడు. హీరో ఒంగోలు చీమ‌కుర్తి గ్రైనేట్ ఫ్యాక్ట‌రీలో ప‌ని చేస్తాడు. హ్యాపీ ఫ్యామిలీ.. హ్యాపీ ప‌ర్స‌న్ ఉన్న‌ట్టుండి ఎలాంటి స‌న్నివేశంలో విప‌రీత‌మైన ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వ‌చ్చింది అన్న‌దే సినిమా`` అంటూ క‌థ‌ను రివీల్ చేశారు. గుణ 369 కి యుఏ స‌ర్టిఫికెట్ వ‌చ్చింది. ఆగ‌స్టు 2న సినిమా రిలీజ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాతో కార్తికేయ ఆశించిన హిట్టొస్తుందా లేదా? అన్న‌ది చూడాలి.