Begin typing your search above and press return to search.

ద్వారకలో ప్రత్యక్షమైన 'కార్తికేయ 2' టీమ్..!

By:  Tupaki Desk   |   5 March 2021 12:00 PM IST
ద్వారకలో ప్రత్యక్షమైన కార్తికేయ 2 టీమ్..!
X
'ప్రేమమ్' ఫేమ్ చందు మొండేటి - యువ హీరో నిఖిల్ కాంబినేషన్ లో వచ్చిన సూపర్ హిట్ 'కార్తికేయ' చిత్రానికి సీక్వెల్ గా ''కార్తికేయ 2'' తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఇందులో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించనుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ - అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లపై టీజీ విశ్వప్రసాద్ - అభిషేక్ అగర్వాల్ - వివేక్ కూచిభోట్ల‌ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. అప్పుడెప్పుడో పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ సినిమా అనేక కారణాలతో ఆలస్యమవుతూ వచ్చింది. అయితే ఇప్పుడు 'కార్తికేయ 2' షూటింగ్ ను తిరిగి ప్రారంభించడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

'కార్తికేయ 2' సినిమా షూటింగ్ కోసం గుజరాత్ రాష్ట్రంలోని ద్వారకా నగరాన్ని ఎంచుకున్నారు. ఇప్పటికే డైరెక్టర్ చందు మొండేటి - కెమెరామెన్ కార్తీక్ ఘట్టమనేని తమ టీమ్ తో కలిసి ద్వారాకలో షూటింగ్ కోసం అనువైన ప్రదేశాల కోసం వేట సాగించారు. ఈ క్రమంలో నిఖిల్ - అనుపమ పరమేశ్వరన్ కూడా ద్వారక చేరుకున్నారని తెలుస్తోంది. ఇకపోతే గ‌త రెండేళ్లుగా 'కార్తికేయ 2' స్క్రిప్ట్ పై వర్క్ చేస్తున్న చందు మొండేటి.. ఓ అద్భుత‌మైన పాయింట్ తో ఈ చిత్రాన్ని రెడీ చేయనున్నాడు. కొన్ని వేల సంవత్సరాల క్రితం నాటి రహస్యం ఆధారంగా ఒక సరికొత్త విషయాన్ని థ్రిల్లింగ్ గా చెప్పబోతున్నట్లు కాన్సెప్ట్ వీడియోలోనే వెల్లడించారు.