Begin typing your search above and press return to search.

హిందీ 'అల వైకుంఠపురంలో' రీమేక్ హీరో దొరికేసినట్లే..!!

By:  Tupaki Desk   |   27 July 2020 1:40 PM IST
హిందీ అల వైకుంఠపురంలో రీమేక్ హీరో దొరికేసినట్లే..!!
X
బాలీవుడ్‌ ఇండస్ట్రీలో రాను రాను తెలుగు సినిమాల రీమేక్ సందడి జోరుగానే కనిపిస్తుంది. ఇప్పటికే జెర్సీ, డియర్ కామ్రేడ్ చిత్రాలు హిందీలో రీమేక్ అవుతుండగా.. ఇటీవలే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్-త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన బ్లాక్ బస్టర్ 'అల వైకుంఠపురంలో' అదే జాబితాలో చేరింది. ఈ ఏడాది సంక్రాంతి బరిలో దిగి తెలుగులో భారీ విజయాన్ని అందుకొన్న అల వైకుంఠపురంలో సినిమాను హిందీలో అశ్విన్ వర్దె రీమేక్ హక్కులు దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు దేశీ బాయ్స్, డిష్యూం సినిమాలకు దర్శకత్వం వహించిన రోహిత్ ధావన్ డైరెక్షన్ చేయబోతున్నాడు. అయితే ఈ సినిమాలో అల్లు అర్జున్ స్థానంలో కార్తీక్ ఆర్యన్‌ను ఎంపిక చేసినట్టు సమాచారం.

ప్రస్తుతం దేశంలో కరోనా లాక్‌డౌన్ కొనసాగతుండటంతో హిందీ స్క్రిప్టును ఇటీవల వీడియో కాల్ ద్వారా హీరో కార్తీక్ ఆర్యన్‌ విన్నాడట. కార్తీక్ స్క్రిప్ట్ విని సానుకూలంగా స్పందించాడని బాలీవుడ్ మీడియా తెలిపింది. లాక్‌డౌన్ పూర్తికాగానే షూటింగ్ చేయడానికి అనుగుణంగా డేట్లు, షెడ్యూల్ వివరాలను కార్తీక్ కన్ఫర్మ్ చేస్తాడని టాక్. కార్తీక్ ఆర్యన్ ఇప్పటికే దోస్తానా2 మూవీ పూర్తిచేసాడు. భూల్ భులయ్యా2 కూడా చివరి దశలో ఉండగా.. మరో భారీ చిత్రానికి కార్తీక్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. అలాగే అల వైకుంఠపురంలో షూటింగ్‌లో పాల్గొనేందుకు ఎంతో ఆసక్తిగా ఉన్నాడట. ఈ సినిమా నిర్మాణంలో ఏక్తా కపూర్, అల్లు అరవింద్ లు కూడా భాగం కానున్నారట. అన్నీ అనుకూలిస్తే వచ్చే ఏడాది ఫిబ్రవరిలో షూటింగ్ మొదలు అవుతుందని సినీవర్గాలలో వినికిడి. చూడాలి మరి బన్నీ పాత్రలో కార్తీక్ ఎలా మెప్పిస్తాడో..!