Begin typing your search above and press return to search.

స్టార్ డాటర్ కి యంగ్‌ హీరో కౌంటర్‌ ఇచ్చాడ!

By:  Tupaki Desk   |   25 July 2022 8:03 AM GMT
స్టార్ డాటర్ కి యంగ్‌ హీరో కౌంటర్‌ ఇచ్చాడ!
X
బాలీవుడ్‌ యంగ్‌ హీరో కార్తీక్ ఆర్యన్‌ ప్రస్తుతం మోస్ట్‌ క్రేజీ స్టార్‌ ఆఫ్ ది ఇండస్ట్రీ. ఈయన నటించిన భూల్‌ భులయ్యా 2 సినిమా సూపర్ హిట్‌ అయిన నేపథ్యంలో ఈయన స్థాయి మరింతగా పెరిగినట్లు అయ్యింది. సినిమా లు వరుసగా వచ్చి బాక్సాఫీస్‌ వద్ద బొక్క బోర్లా పడుతున్న సమయంలో ఈయన నిలిచి సక్సెస్ దక్కించుకున్న నేపథ్యంలో ఇప్పుడు బాలీవుడ్‌ తోపు హీరో ఈయనే అన్నట్లుగా ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

హీరోగా కార్తీక్ ఆర్యన్‌ వరుసగా సినిమా లు చేస్తూ సక్సెస్‌ గా దూసుకు పోతూ ఉంటే.. వ్యక్తిగత విషయంలో మాత్రం కాస్త ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నాడు. గత కొన్నాళ్లుగా ఈయన బాలీవుడ్ స్టార్‌ సైఫ్ అలీ ఖాన్‌ కూతురు సారా అలీ ఖాన్‌ తో రిలేషన్ లో ఉన్నాడనే వార్తలు వచ్చాయి. ఆ వార్తలకు సంబంధించిన పలు సందర్బాల్లో అనధికారికంగా కూడా సారా కార్తీక్ లు క్లారిటీ ఇచ్చారు.

ఇద్దరు రిలేషన్ లో ఉన్నారు.. పెళ్లి పీఠలు ఎక్కేందుకు కూడా రెడీ అవుతున్నారు అనుకుంటూ ఉండగా అనూహ్యంగా బ్రేకప్‌ అయ్యారు. బ్రేకప్‌ కు కారణం ఏంటీ అనే విషయమై రకరకాలుగా కామెంట్స్ వస్తున్నాయి. తాజాగా కాఫీ విత్‌ కరణ్‌ టాక్‌ షో లో జాన్వీ కపూర్‌ తో కలిసి పాల్గొన్న సారా అలీ ఖాన్‌ పాల్గొంది. ఆ సమయంలో కార్తీక్ ఆర్యన్‌ గురించి ఇండైరెక్ట్‌ గా మాట్లాడటం జరిగింది.

షో లో సారాని నీ మాజీ ప్రియుడు ఎందుకు మాజీ అయ్యాడు అంటూ కరణ్‌ ప్రశ్నించాడు. దానికి సారా చాలా గడుసుగా సమాధానం చెప్పింది. ఎందుకంటే అతను చాలా మందికి మాజీ ప్రియుడు కనుక అంది. ప్రతి ఒక్కరు కూడా ఆమె వ్యాఖ్యలను అర్థం చేసుకున్నారు. నిజంగా కార్తీక్ ఆర్యన్‌ కు అంతగా ప్రేమ కథలు ఉన్నాయా అంటూ చర్చించుకున్నారు.

సారా వ్యాఖ్యలకు కౌంటర్‌ అన్నట్లుగా తాజాగా కార్తీక్‌ ఆర్యన్ స్పందించాడు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో యాంకర్‌ మీరు గర్వపడే విషయం చెప్పండి అంటూ అడిగిన సమయంలో.. ర్యాపిడ్ ఫైర్ రౌండ్స్ లో నా పేరు వినిపించడం గర్వంగా ఉందని సమాధానం ఇచ్చాడు. ఈ స్పందన ఖచ్చితంగా సారా కు కౌంటర్ అన్నట్లుగా కార్తీక్ ఆర్యన్‌ అభిమానులు అంటున్నారు.

ఒక వ్యక్తి గురించి జనాల్లో బ్యాడ్‌ చేసినట్లుగా ఆమె వ్యవహరించినందుకు గాను కార్తీక్‌ ఆర్యన్‌ ఇచ్చిన కౌంటర్‌ బాగుందని కొందరు అంటూ ఉంటే.. మరి కొందరు మాత్రం స్టార్‌ డాటర్‌ కు ఇప్పుడైనా ఆ వ్యక్తి గురించి నిజం తెలిస్తే బాగుండని కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి ఈ మాజీ ప్రేమికుల కౌంటర్‌.. ప్రతి కౌంటర్ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.