Begin typing your search above and press return to search.

ఒకే సారి కార్తి డ‌బుల్ ధ‌మాకా ట్రీట్

By:  Tupaki Desk   |   7 Jan 2022 10:33 AM GMT
ఒకే సారి కార్తి డ‌బుల్ ధ‌మాకా ట్రీట్
X
విభిన్న‌మైన చిత్రాల్లో న‌టిస్తూ త‌న ప్ర‌త్యేక‌త‌ని చాటుకుంటున్నారు హీరో కార్తి. `ధీర‌న్ అధిగారం ఒండ్రు`(తెలుగులో `ఖాకీ`), ఖైదీ వంటి చిత్రాల‌తో మంచి గుర్తింపుని సొంతం చేసుకున్నారు. కార్తీకి త‌మిళ్ తో పాటు తెలుగులోనూ మంచి మార్కెట్ వుండ‌ట‌మే కాకుండా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ వుంది. దాంతో ఆయ‌న సినిమా వ‌స్తోంద‌టే రెండు భాష‌ల్లోనూ మంచి క్రేజ్ ఏర్ప‌డ‌టం ఆన‌వాయితీగా మారింది. ఇటీవ‌ల ఖాకీ, ఖైదీ చిత్రాల‌తో బ్యాక్ టు బ్యాక్ సూప‌ర్ హిట్ ల‌ని సొంతం చేసుకున్న కార్తీ ఈ సారి రెట్టించిన జోష్ తో మ‌రో మూడు క్రేజీ చిత్రాల‌తో రాబోతున్నాడు.

మ‌ణిర‌త్నం ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిస్తున్న `పొన్నియిన్ సెల్వ‌న్‌`లో కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్న కార్తీ సోలో హీరోగా స‌ర్దార్‌, విరుమ‌న్ సినిమాలు చేస్తున్నాడు. `స‌ర్దార్‌` చిత్రానికి `చ‌క్ర‌` ఫేమ్ పీఎస్ మిత్ర‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఇక `విరుమ‌న్‌` సినిమాని ముత్త‌య్య డైరెక్ట్ చేస్తున్నారు. ఈ మూవీని స్వ‌యంగా హీరో సూర్య నిర్మిస్తున్నారు. ఇదిలా వుంటే `స‌ర్దార్‌`లో కార్తి విభిన్న‌మైన గెట‌ప్ ల‌లో క‌నిపించ‌బోతున్నారు.

తాజాగా `స‌ర్దార్‌` మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ ఇటీవ‌లే మ‌ళ్లీ మొద‌లైంది. ఈ మూవీకి సంబంధించిన విశేషం ఏంటంటే ఇందులో వ‌య‌సు మ‌ళ్లిన వ్య‌క్తిగానూ, యంగ్ క్యారెక్ట‌ర్ లోనూ కార్తి టూ డైమెన్ష‌న్స్ వున్న పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్నారు. ఇందుకు సంబంధించిన స్టిల్స్ తాజాగా బ‌య‌టికి వ‌చ్చాయి. ఈ ఫొటోలు చూసిన వారంతా ఒకే పాత్ర‌లో టూ షేడ్స్ ని చూపిస్తుండ‌టం.. పాత్ర‌ల ప‌రంగా కార్తీ ట్రాన్స్‌ఫ‌ర్‌మేష‌న్ మైండ్ బ్లోయింగ్ అంటూ కామెంట్ చేస్తున్నారు.

అంతే కాకుండా ఈ మూవీలో కార్తి డ్యూయెల్ రోల్ లో ఏమైనా క‌నిపించ‌బోతున్నాడా? అంటూ అనుమానాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. స్పై థ్రిల్ల‌ర్ గా రూపొందుతున్న ఈ మూవీలో రాశిఖ‌న్నా హీరోయిన్ గా న‌టిస్తోంది. కీల‌క పాత్ర‌లో సిమ్రాన్ క‌నిపించ‌నున్న ఈ మూవీలో బాలీవుడ్ న‌టుడు చుంకీ పాండే విల‌న్ గా న‌టిస్తున్నారు. తాజా షెడ్యూల్ ప్రారంభం సంద‌ర్భంగా ఫొటోలు వైర‌ల్ కావ‌డంతో అంతా `స‌ర్దార్‌` మూవీ గురించి మాట్లాడుకుంటున్నారు. అంతే కాకుండా ఆన్ ద సెట్స్ లో హీరో కార్తికి ద‌ర్శ‌కుడు సూచ‌న‌లిస్తున్న ఓ వీడియో కూడా నెట్టింట వైర‌ల్ గా మారింది.