Begin typing your search above and press return to search.

ఈసారి పూర్తి స్థాయిలో జక్కన్న తనయుడు!

By:  Tupaki Desk   |   27 Oct 2018 10:26 PM IST
ఈసారి పూర్తి స్థాయిలో జక్కన్న తనయుడు!
X
టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి తనయుడు కార్తికేయ మల్టీ ట్యాలెంటెడ్‌ అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సహాయ దర్శకుడిగా - సహా నిర్మాతగా - ప్రమోషన్‌ ఈవెంట్స్‌ మేనెజ్‌ మెంట్స్‌ - కబడ్డి జట్టు ఓనరుగా అనేక రంగాల్లో తన ప్రతిభ చాటుతున్న కార్తికేయ త్వరలో పెళ్లి పీఠలు ఎక్కబోతున్న విషయం తెల్సిందే. ఇదే సమయంలో మరో రంగంలోకి కూడా కార్తికేయ అడుగు పెట్టబోతున్నట్లుగా సినీ వర్గాల నుండి సమాచారం అందుతుంది.

ఆమద్య నాగచైతన్య నటించిన ‘యుద్దం శరణం’ చిత్రంకు ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ గా వ్యవహరించిన కార్తికేయ త్వరలో పూర్తి స్థాయి నిర్మాతగా మారేందుకు సిద్దం అవుతున్నాడు. దర్శకత్వం కంటే నిర్మాణంపై తనకు ఎక్కువ ఆసక్తి అంటూ గతంలో పలు సార్లు చెప్పిన కార్తికేయ చిన్న చిత్రాలతో నిర్మాతగా మారాలని నిర్ణయించుకున్నాడు. కార్తికేయ తన మొదటి సినిమా నిర్మాణంకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

కార్తికేయ నిర్మాణంలో ‘ఆకాశవాణి’ అనే చిత్రం నిర్మాణం జరుగబోతుంది. చాలా కాలంగా రాజమౌళి డైరెక్షన్‌ డిపార్ట్‌ మెంట్‌ లో సహాయ దర్శకుడిగా వ్యవహరించిన వ్యక్తి ‘ఆకాశవాణి’ చిత్రంతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నట్లుగా సమాచారం అందుతుంది. కార్తికేయ ఈ చిత్రంకు సంబంధించిన కథ చర్చలతో పాటు - అన్ని విషయాల్లో ఇన్వాల్వ్‌ అయ్యి మరీ నిర్మాణ పనులు చూసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. దర్శకత్వ శాఖలో ఉన్న అనుభవం నేపథ్యంలో ఈ చిత్ర నిర్మాణ విషయంలో కార్తికేయ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా సమాచారం అందుతుంది. త్వరలోనే ‘ఆకాశవాణి’ చిత్రంకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.