Begin typing your search above and press return to search.

ఆబ్బాయిగారిది ఆరేళ్ళ ప్రేమ కథ!

By:  Tupaki Desk   |   28 Sept 2018 11:36 PM IST
ఆబ్బాయిగారిది ఆరేళ్ళ ప్రేమ కథ!
X
SS రాజమౌళి తనయుడు కార్తికేయ ఎంగేజ్మెంట్ రీసెంట్ గా తన ఫ్రెండ్ అయిన పూజ ప్రసాద్ తో జరిగిన సంగతి తెలిసిందే. పూజ ఎవరో కాదు. టాలీవుడ్ సీనియర్ హీరో జగపతి బాబు బ్రదర్ కి డాటర్. కార్తికేయ - పూజ ల వివాహం డిసెంబర్ లో జరగనుందని అది డెస్టినేషన్ వెడ్డింగ్ అని ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఇక వారిద్దరి లవ్ గురించి కూడా మరో విషయం బయటకు వచ్చింది.

కార్తికేయ - పూజ లు ఆరేళ్ళ నుండి ప్రేమలో ఉన్నారట. అంటే ప్రేమలో ఫుల్ సీనియారిటీ ఉన్నట్టే. పూజ కర్నాటక సంగీతం నేర్చుకోవడమే కాదు ఇప్పటికే పలు భక్తి ఆల్బమ్స్ లో పాటలు కూడా పాడిందట. ఇక పెళ్లి గురించి మాట్లాడుతూ కార్తికేయ "పూజను కలవక ముందునుండే నాకు డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోవాలని ఉండేది. అది బీచ్ అయినా కావచ్చు లేదా ఒక హిట్ స్టేషన్ అయినా కావచ్చు.. బీచ్ లొకేషన్ అయిన ఉక్కబోత ఉండే వాతావరణం ఉంటుంది కాబట్టి హిల్ స్టేషన్ ను ఎంచుకునే అవకశం ఉంది" అన్నాడు.

ఇక డెస్టినేషన్ వెడ్డింగ్ అనగానే మీరు ఇటలీ లేదా ఇంగ్లాండ్ అని ఫిక్స్ కావద్దు ఎందుకంటే కార్తికేయ తన పెళ్లి ఇండియాలోనే ఉండే అవకాశం ఉందని హింట్ ఇచ్చాడు. పెళ్లి ఎక్కడ జరిగినా రిసెప్షన్ కు మాత్రం ఫిలిం ఇండస్ట్రీ అంతా తరలి రావడం ఖాయం. బాలీవుడ్ నుండి కోలీవుడ్ దాకా ప్రముఖులు సందడి చేయడం కూడా ఖాయం.