Begin typing your search above and press return to search.

కండ‌లు చూపించి ఫిట్నెస్ ట్రైన‌ర్ కి ప్ర‌చార‌మా?

By:  Tupaki Desk   |   17 April 2021 7:30 AM GMT
కండ‌లు చూపించి ఫిట్నెస్ ట్రైన‌ర్ కి ప్ర‌చార‌మా?
X
కెరీర్ ప్రారంభించిన త‌క్కువ స‌మ‌యంలోనే ప‌రిణ‌తి చెందిన న‌టుడిగా త‌న‌ని తాను ఆవిష్క‌రించుకున్నారు యువ‌హీరో కార్తికేయ‌. ఆర్.ఎక్స్ 100తో బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకున్నాక అతడు వ‌రుసగా అర‌డ‌జ‌ను చిత్రాల్లో న‌టించిన సంగ‌తి తెలిసిందే. స‌క్సెస్ ముఖం చాటేసినా కానీ న‌టుడిగా నిరూపించుకోవ‌డంతో కార్తికేయ‌కు ఆఫ‌ర్ల ప‌రంగా కొద‌వేమీ లేదు. ఇటీవ‌లే జీఏ2 సంస్థ నిర్మించిన చావు క‌బురు చ‌ల్ల‌గాలోనూ అత‌డు క‌థానాయకుడు. కానీ ఈ సినిమా ఫ్లాప‌వ్వ‌డం తీవ్రంగా నిరాశ‌ప‌రిచింది.

కార్తికేయ త‌దుప‌రి అజ‌య్ భూప‌తి ద‌ర్శ‌క‌త్వంలో వేరొక చిత్రంలో న‌టించేందుకు స‌న్నాహ‌కాల్లో ఉన్నాడ‌న్న ప్ర‌చారం ఉంది. శ్రీ సారిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమాకి సంత‌కం చేశారు. అలాగే అజిత్ హీరోగా హెచ్‌.వినోద్ ద‌ర్శ‌క‌త్వంలో బోనీక‌పూర్ నిర్మిస్తున్న భారీ మ‌ల్టీస్టార‌ర్ లోనూ కార్తికేయ ఒక కీల‌క పాత్ర‌ను పోషిస్తున్నారు. బ‌హుభాష‌ల్లో ఈ చిత్రం విడుద‌ల కానుంది.

మ‌రోవైపు కార్తికేయ టాలీవుడ్ ఫిట్నెస్ ఫ్రీక్ గా జిమ్స‌న్ లుక్ తో స‌ర్ ప్ర‌జ్ చేస్తున్నారు. అత‌డు కండ‌లు పెంచి 6 ప్యాక్ రూపంతో న‌రాలు పొంగిస్తున్న ఫోటోలు అంత‌ర్జాలంలో వేడి పెంచుతున్నాయి. యువ‌హీరో మేకోవ‌ర్ అభిమానుల్ని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. తాజాగా ఇన్ స్టాలో ప‌ర్ఫెక్ట్ ఫిట్ బాడీని ప్ర‌ద‌ర్శిస్తూ అత‌డు త‌న వ్య‌క్తిగ‌త జిమ్ కోచ్ కి ప్ర‌చారం చేయ‌డం హాట్ టాపిక్ గా మారింది.

``మీరు ఎంత స‌మ‌ర్థులో చూపించే ఇలాంటి ఫిట్ బాడీని త‌యారు చేయ‌గ‌ల బ్యూటిఫుల్ మెచీన్ (కోచ్) అత‌డి నాలెజ్ వ‌ల్ల‌నే ఇది సాధ్య‌మైంది! త‌న‌ పేరు కుల్ దీప్ సేథి`` అంటూ ప‌రిచ‌యం చేశారు కార్తికేయ‌. రాజా ప్ర‌ణ‌వ్ ఈ ఫోటోషూట్ నిర్వ‌హించారు.