Begin typing your search above and press return to search.

అన్నిసార్లు షర్టు విప్పడమేంటి రాజా

By:  Tupaki Desk   |   3 Aug 2019 1:30 AM GMT
అన్నిసార్లు షర్టు విప్పడమేంటి రాజా
X
సినిమాల్లో హీరోయిన్లు అంగాంగ ప్రదర్శన చేయడం సహజమే కానీ హీరోలు చొక్కాలు విప్పి హాఫ్ ఎక్స్ పోజింగ్ చేయడం చాలా అరుదుగా జరుగుతుంది. ఎప్పుడైనా సిక్స్ ప్యాక్ చేసినప్పుడో లేదా కథ డిమాండ్ ప్రకారం తప్పని పరిస్థితిలో విప్పాల్సి వచ్చినప్పుడో తప్ప అదే పనిగా ఇదుగో మా బాడీ చూడండి అని ఏ హీరో తెరమీద విన్యాసాలు చేయడు. కానీ అదేంటో పట్టుమని ఐదు సినిమాల వయసు కూడా లేని కార్తికేయ నటించే ప్రతి మూవీలోనూ ఏదో ఒక సందర్భంలోనూ పాటలోనో చొక్కా విప్పించకుండా దర్శకులు వదలడం లేదు.

ఆరెక్స్ 100లో ఇందూ పాత్ర తనను అలా చూసే మోహించింది కాబట్టి ఆ సినిమా హిట్ అయ్యుండనుకుని అదేదో సెంటిమెంట్ గా కార్తికేయ భావిస్తునాడో తెలియదు కానీ ఇవాళ విడుదలైన గుణ 369లో ఏకంగా నాలుగైదు సార్లు షర్ట్ విప్పే ప్రోగ్రాం పెట్టడం అసలు ట్విస్ట్. నిజానికి కథ ప్రకారం చూసినా ఇంకే యాంగిల్ చూసినా గుణ 369లో హీరో అన్నిసార్లు షర్ట్ విప్పు స్కిన్ షో చేయాల్సిన అవసరం లేదు. ఇంట్రో సీన్ లో ఇంట్లో నిద్రలేవడమే హాఫ్ న్యూడ్ గా లేచే హీరో మరో సన్నివేశంలో హీరోయిన్ ని లవ్ పడేసేందుకు కూడా చొక్కా విప్పే స్కెచ్చే ఎన్నుకుంటాడు.

ఇక పాటల్లో సరే సరి. సీన్లలో విప్పగా లేనిది పాటల్లో చేస్తే ఏముంది అనుకున్నారో ఏమో అక్కడ కూడా రిపీట్ చేశారు. ఇలా పదే పదే చొక్కా విప్పడం సెంటిమెంట్ అనుకుంటే మాత్రం దానికి ఇక చెక్ పెట్టేయడం బెటర్. సిక్స్ ప్యాక్ కు ఇప్పుడు క్రేజ్ లేదు. పైగా సల్మాన్ ఖాన్ అంతటి హీరో బేర్ బాడీ చూపిస్తేనే ఎవరూ పట్టించుకోవడం లేదు. అలాంటిది కార్తికేయ ఇకపై ఇలా షర్ట్ విప్పే ప్రోగ్రాం మానేసి కాస్త కంటెంట్ మీద నటన మీద దృష్టి పెడితే బెటర్