Begin typing your search above and press return to search.
టీజర్ టాక్: అందులో దాగి ఉన్న ఓ రహస్యం
By: Tupaki Desk | 1 March 2020 4:09 PM ISTఈతరం టాలీవుడ్ దర్శకులలో టాలెంటెడ్ ఫిలిం మేకర్ గా గుర్తింపు తెచ్చుకున్న వారిలో చండూ మొండేటి ఒకరు. మొదటి సినిమా 'కార్తికేయ' తోనే కమర్షియల్ విజయంతో పాటుగా విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. 'కార్తికేయ' విడుదలైన నాలుగేళ్లకు ఇప్పుడు 'కార్తికేయ' సీక్వెల్ రెడీ అవుతోంది. నిఖిల్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ... అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్ విడుదల చేశారు.
"కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరత ఖండే" అంటూ టీజర్ ను చిత్ర కథ టైప్ లో ప్రారంభించారు. 5118 ఏళ్ల క్రితం ముగిసిన ఒక యుగం అంటూ కృష్ణుడి కాలి వేలికి ముసలం గుచ్చుకోవడం చూపించారు. "ఆ యుగ అనంత జ్ఞాన సంపద.. అందులో దాగి ఉన్న ఓ రహస్యం. ఈ యుగంలో అన్వేషణ.. స్వార్థానికి ఒకరు.. సాధించడానికి ఒకరు. అతని సంకల్పానికి సాయం చేసిన వారెవరు?" అంటూ వాయిస్ ఓవర్ వినిపిస్తూ ఉంటుంది. "దైవం మనుష్య రూపేణా" అనే స్లైడ్ కూడా చూపించారు. ద్వాపర యుగాంతంలో మరుగుపడిపోయిన ఒక రహస్యం గురించి ఇప్పుడు కలియుగంలో శోధన.. ఈ పరిశోధనలో హీరో నిఖిల్ పాలు పంచుకుంటాడు. కార్తికేయ ఫస్ట్ పార్ట్ తరహాలోనే ఇది కూడా డివోషనల్ టచ్ ఉండే ఒక న్యూ ఏజ్ థ్రిల్లర్ అనిపిస్తోంది.
ఈ టీజర్ ను అమర్ చిత్రకథ తరహాలో బొమ్మలతో చూపించడం కార్తికేయ సినిమాను గుర్తు తెచ్చింది. ఇక చివర్లో వచ్చే 'చైత్రంలో చిత్రీకరణ'.. ఇతర వివరాలలో హబుల్ టెలిస్కోప్ పెట్టి వెతికినా ఒక్క ఆంగ్ల అక్షరం లేకుండా ఆశ్చర్యపరచడం విశేషం. మొదటి టీజర్ తోనే ఈ సినిమాపై ఆసక్తిని రేకెత్తించాడు చందు మొండేటి.. ఆలస్యం ఎందుకు. చూసేయండి.