Begin typing your search above and press return to search.

స్పెషల్ పోస్టర్ తో యువ హీరోకి 'కార్తికేయ 2' టీమ్ బర్త్ డే విషెస్..!

By:  Tupaki Desk   |   1 Jun 2021 4:35 AM GMT
స్పెషల్ పోస్టర్ తో యువ హీరోకి కార్తికేయ 2 టీమ్ బర్త్ డే విషెస్..!
X
యువ హీరో నిఖిల్ - అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం ''కార్తికేయ 2''. 'ప్రేమమ్' ఫేమ్ చందు మొండేటి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. చందు మొండేటి - నిఖిల్ కాంబోలో వచ్చిన సూపర్ హిట్ సినిమా 'కార్తికేయ'కి సీక్వెల్ గా ఈ సినిమాని రూపొందిస్తున్నారు. కొన్ని వేల సంవత్సరాల క్రితం నాటి రహస్యం ఆధారంగా థ్రిల్లింగ్ కాన్సెప్ట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

అయితే నేడు హీరో నిఖిల్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ఓ సరికొత్త పోస్టర్ ని చిత్ర బృందం విడుదల చేసింది. నిఖిల్ దేని గురించో తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు కనిపిస్తున్న ఈ పోస్టర్ ఆకట్టుకుంటోంది. ఈ పోస్టర్ లో 'రక్షకులు సంక్షోభంలో ఉద్భవించారు' అని పేర్కొన్నారు. ఈ చిత్రంలో ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కీలక పాత్ర పోషిస్తున్నారు.

''కార్తికేయ 2'' చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. కాలభైరవ సంగీతం సమకూరుస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ - అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లపై టీజీ విశ్వప్రసాద్ - అభిషేక్ అగర్వాల్ - వివేక్ కూచిభోట్ల‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవలే గుజరాత్ - హిమాచల్ ప్రదేశ్ లలోని కొన్ని ప్రాంతాల్లో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించారు. కోవిడ్ పరిస్థితుల్లో నిలిచిపోయిన 'కార్తికేయ 2' షూటింగ్ త్వరలోనే తిరిగి ప్రారంభం కానుంది.