Begin typing your search above and press return to search.

కార్తికేయ$1.5... ఈ జోరు ఆగేది ఎన్నడు?

By:  Tupaki Desk   |   4 Sep 2022 2:30 PM GMT
కార్తికేయ$1.5... ఈ జోరు ఆగేది ఎన్నడు?
X
నిఖిల్‌ హీరోగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా రూపొందిన కార్తికేయ 2 సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. విడుదల అయ్యి నాలుగు వారాలు అయినా కూడా వసూళ్లు మాత్రం కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఉత్తర భారతంలో ఈ సినిమా కేవలం 50 థియేటర్లలో విడుదల అయ్యి సక్సెస్ టాక్ తో పెద్ద ఎత్తున అక్కడ థియేటర్ల సంఖ్య పెంచారు. అదే విధంగా అమెరికాలో కూడా భారీగా కార్తికేయ 2 జోరు కంటిన్యూ అవుతోంది.

కార్తికేయ 2 సినిమా ఉత్తర భారతంలో పాతిక కోట్ల వరకు దక్కించుకుంది. ఇక యూఎస్ లో ఈ సినిమా మిలియన్‌ డాలర్ల క్లబ్‌ లో చేరిన సమయంలో అంతా కూడా వావ్‌ అనుకున్నారు. కానీ ఇప్పుడు ఏకంగా 1.5 మిలియన్‌ డాలర్లను క్రాస్‌ చేసి ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. కార్తికేయ 2 సినిమా విడుదల అయినప్పటి నుండి మరే సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది.

వచ్చిన సినిమా వచ్చినట్లుగానే నిరాశ పర్చి వెనక్కి వెళ్లి పోయాయి. దాంతో కార్తికేయ 2 వారం వారం వసూళ్లను పెంచుకుంటూ ఉంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఉత్తర భారతం మరియు యూఎస్ లో కూడా ఈ సినిమా సాధిస్తున్న వసూళ్ల కు అంతా కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికే వంద కోట్ల క్లబ్‌ లో చేరిన ఈ సినిమా ఇదే జోరు కొనసాగితే అతి త్వరలోనే 125 కోట్లకు కూడా చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ వీకెండ్‌ కూడా కార్తికేయ 2 సినిమాదే అంటూ బాక్సాఫీస్‌ వర్గాల వారు అంటున్నారు. వచ్చే వీక్‌ డేస్ లో కూడా కార్తికేయ 2 సినిమా అంతో ఇంతో రాబట్టే అవకాశం ఉంది. మొత్తానికి ఈ జోరు ఆగేది ఎప్పుడు అంటూ అంతా చర్చించుకుంటున్నారు.