Begin typing your search above and press return to search.

బాబోయ్‌ ఇంత బిల్‌ ఏంటీ అంటున్న హీరోయిన్‌

By:  Tupaki Desk   |   26 Jun 2020 1:00 PM IST
బాబోయ్‌ ఇంత బిల్‌ ఏంటీ అంటున్న హీరోయిన్‌
X
తెలుగు తమిళంలో హీరోయిన్‌ గా పలు చిత్రాల్లో నటించిన కార్తీక నాయర్‌ గుర్తుంది కదా.. ఈమద్య కాస్త సినిమాల్లో ఈమె కనిపించడం తగ్గినా కూడా సోషల్‌ మీడియాలో మాత్రం రెగ్యులర్‌ గానే కనిపిస్తూ ఉంటుంది. తాజాగా తనకు ఎదురైన వింత అనుభవంతో కార్తీక సోషల్‌ మీడియాలో ప్రత్యక్ష్యం అయ్యింది. ముంబయిలోని ఈమె ఇంటికి వచ్చిన కరెంటు బిల్లు ఏకంగా లక్ష ఉందని ఆ బిల్లు చూసి షాక్‌ అయ్యాను అంటోంది.

ముంబయిలోని తన ఇంటికి అదానీ ఎలక్ట్రిసిటీ సరఫరా ఉంది. గత రెండు నెలలుగా బిల్లు తీయకుండా ఇటీవల డైరెక్ట్‌ గా బిల్లు పంపించారు. ఆ బిల్లులో లక్ష రూపాయలు ఉండటం చూసి అవాకయ్యాను. ఇది నా హోటల్‌ బిల్లు కంటే ఎక్కువగా ఉంది. నా ఇంటికి కరెంట్‌ బిల్లు అంతగా ఎలా వచ్చింది అంటూ ఆమె సోషల్‌ మీడియాలో అదానీ గ్రూప్‌ ను ప్రశ్నించింది. మినిమం కూడా పవర్‌ వాడకుండానే అంత బిల్లు ఎలా వచ్చిందో మీరే చెప్పాలంటూ ఎలక్ట్రిసిటీ అధికారిక ఖాతాను ట్యాగ్‌ చేసింది.

ఏప్రిల్‌ మరియు మే నెలల్లో బంద్‌ ఉన్న కారణంగా అప్పుడు బిల్లులు పంపించని ఎలక్ట్రిసిటీ కంపెనీలు అన్ని కూడా ఇప్పుడు బిల్లులు పంపిస్తున్నారు. మూడు నెలల బిల్లులు వేస్తున్న నేపథ్యంలో కొందరికి పొరపాటున లక్షలకు లక్షల బిల్లులు వస్తున్నాయి. వేలల్లో కూడా బిల్లులు పంపుతున్నారు. హీరోయిన్‌ కార్తీకకు వచ్చిన సమస్యనే పలువురు సామాన్యులకు వచ్చింది.