Begin typing your search above and press return to search.

మాటల్లేని మరో మూవీ వస్తోందట

By:  Tupaki Desk   |   2 Feb 2017 5:37 AM GMT
మాటల్లేని మరో మూవీ వస్తోందట
X
అప్పట్లో మూకీ సినిమాల తర్వాత.. సినిమాలో ఒక్క మాట కూడా లేకుండా కేవలం భావాలతో సినిమాను చూపించే ప్రయత్నం చేశారు కమల్ హాసన్. పుష్పక విమానం పేరుతో వచ్చిన ఈ చిత్రం అప్పట్లో సంచలనం. అప్పటి నుంచి మరెవరూ అలాంటి ప్రయత్నాన్ని చేసే ధైర్యం చేయలేదు.

విభిన్న చిత్రాలను అందిస్తాడనే గుర్తింపు పొందిన కార్తీక్ సుబ్బరాజ్ ఇప్పుడు ఓ సైలెంట్ ఫిలింను అందించేందుకు రెడీ అవుతున్నాడు తెలుస్తోంది. పిజ్జా.. జిగర్తాండ.. ఇరైవి వంటి చిత్రాలను తెరకెక్కించిన.. విభిన్న కథాంశాల ఎంపికతో అందరినీ ఆకట్టుకున్నాడు కార్తీక్ సుబ్బరాజ్. ఇప్పుడు బెంచ్ ఫ్లిక్స్ పేరుతో కొత్త దర్శకులను ప్రోత్సహించేందుకు తనే ఓ బ్యానర్ ప్రారంభించాడు. జగదీష్ పాండియన్ డైరెక్షన్ లో మాటల్లేకుండా ఓ షార్ట్ ఫిలిం తెరకెక్కించనున్నాడు కార్తీక్ సుబ్బరాజ్

ఎస్కేప్ అనే టైటిల్ పై రూపొందనున్న ఈ షార్ట్ ఫిలిం నిడివి కేవలం 13 నిమిషాలు మాత్రమే. 'పరిస్థితులతో సంబంధం లేని కొత్త వ్యక్తికి అయినా సరే.. మరొకరి జీవితంలో అత్యంత కీలకమైన క్షణానికి కారణం కావచ్చు' అనే థీమ్ పై ఈ చిత్రం రూపొందనుంది. మాటల్లేని ఈ చిత్రానికి టిమోతీ బక్ మాన్ సంగీతం అందించనుండగా.. సేథ్ పాండియన్ సినిమాటోగ్రఫీ అందించనున్నాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/