Begin typing your search above and press return to search.

కోలీవుడ్లో అదిరిపోయే కాంబినేష‌న్‌

By:  Tupaki Desk   |   24 April 2016 4:25 AM GMT
కోలీవుడ్లో అదిరిపోయే కాంబినేష‌న్‌
X
అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌ గా ప‌ని చేసిన అనుభ‌వం లేకుండా.. షార్ట్ ఫిల్మ్స్ తీసిన అనుభ‌వంతో మెగా ఫోన్ ప‌ట్టేసి..కేవ‌లం కోటిన్న‌ర రూపాయ‌ల చిన్న బ‌డ్జెట్లో ‘పిజ్జా’ లాంటి సెన్సేష‌న‌ల్ మూవీ మొత్తం ఇండియ‌న్ ఫిలిం ఇండ‌స్ట్రీ దృష్టిని త‌న వైపు తిప్పుకున్న ద‌ర్శ‌కుడు కార్తీక్ సుబ్బ‌రాజ్. అత‌డి రెండో సినిమా ‘జిగ‌ర్ తాండా’ కూడా పెద్ద సంచ‌ల‌న‌మే. సిద్దార్థ్ హీరోగా న‌టించిన ఈ సినిమా క‌ల్ట్ క్లాసిక్ గా నిలిచిపోయింది. ఇప్పుడీ యువ ద‌ర్శ‌కుడు ‘ఇరైవి’ పేరుతో ఎస్‌.జె.సూర్య‌.. విజ‌య్ సేతుప‌తి.. బాబీ సింహా.. అంజ‌లి.. క‌మ‌లిని ముఖ‌ర్జీ ప్ర‌ధాన పాత్ర‌ల్లో ఓ సినిమా తెర‌కెక్కించాడు. అది త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. దాని మీదే మంచి అంచ‌నాలే ఉన్నాయి.

ఈ త‌రం మ‌ణిర‌త్నంగా గుర్తింపు తెచ్చుకున్న కార్తీక్‌.. త‌న త‌ర్వాతి సినిమాను ధ‌నుష్ తో చేయ‌బోతుండ‌టం విశేషం.ధ‌నుష్ సినిమాలు ఎంత వైవిధ్యంగా ఉంటాయో.. మంచి డైరెక్ట‌ర్ల చేతిలో ప‌డితే అత‌డిలోని న‌టుడు ఎలా విశ్వ‌రూపం చూపిస్తాడో కొత్త‌గా చెప్పాల్సిన ప‌ని లేదు. కార్తీక్ సుబ్బ‌రాజ్ లాంటి ఎగ్జైటింగ్ డైరెక్ట‌ర్.. ధనుష్ లాంటి గ్రేట్ యాక్ట‌ర్ క‌లిస్తే ఆ కాంబినేష‌న్ సెన్సేష‌న‌లే. వీళ్లిద్ద‌రి సినిమా గురించి ఈ రోజే ప్ర‌క‌ట‌న వెలువ‌డింది. సెప్టెంబ‌ర్లో సినిమా సెట్స్ మీదికి వెళ్తుంది.ప్ర‌స్తుతం ధ‌నుష్ ‘కోడి’ అనే ఓ సినిమా. గౌత‌మ్ మీన‌న్ ద‌ర్శ‌క‌త్వంలో మ‌రో సినిమా చేస్తున్నాడు. ఈ రెండు చిత్రాలూ ఈ ఏడాదే విడుద‌ల‌వుతాయి.