Begin typing your search above and press return to search.

కార్తీక్ ర‌త్నంతో మాస్ మ‌హా రాజా క్రైమ్ కామెడీ!

By:  Tupaki Desk   |   11 Aug 2022 8:59 AM GMT
కార్తీక్ ర‌త్నంతో మాస్ మ‌హా రాజా క్రైమ్ కామెడీ!
X
కంటెంట్ ప్ర‌ధానంగా సాగే సినిమాల‌కు ఆద‌ర‌ణ వుంటున్న విష‌యం తెలిసిందే. ఇలాంటి సినిమాల‌ని ప్రోత్స‌హించాల‌నే ఆలోచ‌న‌లో మాస్ మ‌హారాజా కొత్త‌గా ఆర్టీ టీమ్ వ‌ర్క్స్ అనే పేరుతో సొంత నిర్మాణ సంస్థ‌ని ప్రారంభించారు. ఈ బ్యాన‌ర్ లో క‌థాబ‌ల‌మున్న సినిమాల‌ని ప్రోత్స‌హిస్తూ వ‌స్తున్నారు. విష్ణు విశాల్ 'మ‌ట్టి కుస్తీ'తో పాటు ప‌లు సినిమాల‌కు అసోసియేట్ గా వ్య‌వ‌హ‌రిస్తూ వస్తున్న మాస్ మ‌హారాజా ర‌వితేజ తాజాగా యంగ్ హీరో తో ఓ మూవీకి శ్రీ‌కారం చుట్టారు.

కురాఫ్ కంచ‌ర పాలెం, గాడ్స్ ఆఫ్ ధ‌ర్మ‌పురి, అర్థ శ‌తాబ్దం, నార‌ప్ప వంటి చిత్రాల‌తో న‌టుడుగా మంచి గుర్తింపుని సొంతం చేసుకున్న కార్తీక్ ర‌త్నంతో హీరో ర‌వితేజ ఓ మూవీని నిర్మిస్తున్నారు.

ఈ సినిమాకు 'ఛాంగురే బంగారు రాజా' అనే టైటిల్ ని ఖ‌రారు చేశారు. గురువారం ఈ మూవీ టైటిల్ తో పాటు ఫ‌స్ట్ లుక్ ని విడుద‌ల చేశారు. గ‌త కొన్ని నెల‌ల క్రితం జ‌రిగిన ఓ ప‌బ్ ఇష్యూతో వార్త‌ల్లో నిలిచిన కుషితా క‌ల్లాపు ఈ మూవీ ద్వారా హీరోయిన్ గా ప‌రిచ‌యం అవుతోంది.

ఈ మూవీ ద్వారా స‌తీష్ వ‌ర్మ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నాడు. క్రైమ్ కామెడీ ఎంట‌ర్ టైన‌ర్ గా రూపొందుతున్న ఈ మూవీలో ర‌విబాబు, స‌త్య అక్క‌ల కీల‌క పాత్రల్లో న‌టిస్తున్నారు. ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ సెప్టెంబ‌ర్ నుంచి ప్రారంభం కానుంది.

'శ్రీ‌కృష్ణ పాండ‌వీయం'లోని పాపుల‌ర్ సాంగ్ 'ఛాంగురే బంగారు రాజా'..ని తీసుకుని ఈ మూవీకి టైటిల్ గా పెట్టారు. గురువారం విడుద‌ల చేసిన టైటిల్ పోస్ట‌ర్ లో కార్తీక్ ర‌త్నం టూ డైమెన్ష‌న్స్ వ‌న్న లూక్స్ తో క‌నిపిస్తున్న తీరు ఆక‌ట్టుకుంటోంది.

ఫ్రేమ్ బై ఫ్రేమ్ పిక్చ‌ర్స్‌ శ్వేతా కాక‌ర్ల‌పూడి, శాలిపి నంబు క్రియేటివ్ ప్రొడ్యూస‌ర్స్ గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. కృష్ణ సౌర‌భ్ సంగీతం అందిస్తుండ‌గా సుంద‌ర్ ఎన్ సీ సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. ఎడిటింగ్ కృష్ణ కార్తీక్ , స్క్రీన్ ప్లే జ‌నార్థ‌న్ ప‌సుమ‌ర్తి. ఈ మూవీకి సంబంధించిన మ‌రిన్ని వివ‌రాల్ని చిత్ర బృందం త్వ‌ర‌లోనే వెల్ల‌డించినుంద‌ట‌.