Begin typing your search above and press return to search.

బుట్ట బొమ్మ.. స్టైలిష్ స్టార్ లా ట్రై చేసినా కానీ..!

By:  Tupaki Desk   |   11 Jun 2021 7:30 AM GMT
బుట్ట బొమ్మ.. స్టైలిష్ స్టార్ లా ట్రై చేసినా కానీ..!
X
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ స్టైలిష్ డ్యాన్సుల‌కు ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఫాలోవ‌ర్స్ ఉన్న సంగ‌తి తెలిసిందే. బాలీవుడ్ లోనూ టైగ‌ర్ ష్రాఫ్ లాంటి స్టార్ బ‌న్ని డ్యాన్సుల‌ను అమితంగా ఇష్ట‌ప‌డ‌తాన‌ని కితాబిచ్చారు. టాలీవుడ్ లో వెస్ట్ర‌న్ స్టైల్ డ్యాన్సుల‌తో అల‌రించిన తొలి త‌రం డ్యాన్సింగ్ స్టార్ గానూ అత‌డికి ప్ర‌త్యేక గుర్తింపు ఉంది.

క్లాసిక్ బ్లాక్ బ‌స్టర్ `అల వైకుంఠ‌పుర‌ములో` చిత్రంలో ప్ర‌తి పాట‌లో బ‌న్ని నృత్య భంగిమ‌లు ఫ్రీ స్ట‌యిల్ ప్ర‌పంచ‌వ్యాప్తంగా యువ‌త‌రాన్ని ఆక‌ర్షించాయి. అలాగే అల‌.. చిత్రంలోని పాట‌ల‌న్నిటికీ ఆస్ట్రేలియ‌న్ క్రికెట‌ర్ డేవిడ్ వార్న‌ర్ ఫ‌న్నీ డ్యాన్సింగ్ వీడియోల‌కు విప‌రీత‌మైన ఫాలోయింగ్ వ‌చ్చిన సంగ‌తి తెలిసిన‌దే.

తాజాగా బ‌న్ని డ్యాన్సుల‌కు మైమ‌రిచిపోయిన బాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో కార్తీక్ ఆర్యన్ బుట్ట బొమ్మ పాట‌ను ఎంపిక చేసుకుని అదిరిపోయే నృత్యాలు చేశాడు. బాలీవుడ్ లో న‌వ‌త‌రం హీరోల్లో చ‌క్క‌ని డ్యాన్స‌ర్ గా గుర్తింపు ఉన్న కార్తీక్ ఫ్రీస్ట‌యిల్ లో డ్యాన్సులు చేసేందుకు ప్ర‌య‌త్నించారు. ఈ వీడియోను తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ కార్తీక్ ఆర్యన్, ``డాష్ డాష్ .. లాగా డాన్స్ చేయాలా? ఎవరూ చూడటం లేదు.. మత్ లిఖ్నా ?`` అంటూ వ్యాఖ్య‌ను జోడించారు. అయితే ఎంద‌రు డ్యాన్స‌ర్లు ఉన్నా బ‌న్ని అంత ఫ్రీస్ట‌యిల్లో చేయ‌డం అంత సులువేమీ కాదు.. దానికోసం కార్తీక్ చాలా ప్రాక్టీస్ చేసి ఉంటార‌ని అర్థ‌మ‌వుతోంది.

ప్ర‌స్తుతం కార్తీక్ ఆర్య‌న్ షేర్ చేసిన డ్యాన్సింగ్ వీడియో ఇంటర్నెట్ లో తుఫాన్ స్పీడ్ తో వైర‌ల్ అవుతోంది. అంతకుముందు ప‌తి ప‌త్ని ఔర్ వో...లో ధీమ్ ధీమ్.. లవ్ ఆజ్ కల్ నుండి `హాన్ మెయిన్ గలాట్` వంటి ఛాలెంజింగ్ సాంగ్స్ కి అత‌డి డ్యాన్సులు ప్ర‌శంస‌లు అందుకున్నాయి.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే... కార్తీక్ ఆర్యన్ వ‌రుస చిత్రాల్లో న‌టిస్తున్నాడు. ధమాకా- హర్రర్-కామెడీ భూల్ భూలైయా- 2 సెట్స్ పై ఉన్నాయి. ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్ తో విభేధాల వ‌ల్ల‌ దోస్తానా 2 నుంచి కార్తీక్ ఆర్య‌న్ అనూహ్యంగా త‌ప్పుకున్న సంగ‌తి తెలిసిందే.