Begin typing your search above and press return to search.

బాలీవుడ్ అల వైకుంఠపురానికి యంగ్ హీరో దొరికాడు..

By:  Tupaki Desk   |   19 April 2020 1:30 AM GMT
బాలీవుడ్ అల వైకుంఠపురానికి యంగ్ హీరో దొరికాడు..
X
బాలీవుడ్‌లో తెలుగు సినిమాల రీమేక్ సందడి భారీగానే కకనిపిస్తుంది. ఇప్పటికే జెర్సీ, డియర్ కామ్రేడ్ చిత్రాలు హిందీలో రీమేక్ అవుతుండగా.. తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్-త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన బ్లాక్ బస్టర్ 'అల వైకుంఠపురంలో' అదే జాబితాలో చేరింది. అయితే తెలుగులో భారీ విజయాన్ని అందుకొన్న అల వైకుంఠపురంలో మూవీని హిందీలో అశ్విన్ వర్దె రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు దేశీ బాయ్స్, డిష్యూం సినిమాలకు దర్శకత్వం వహించిన రోహిత్ ధావన్ డైరెక్షన్ చేయబోతున్నాడు. అయితే ఈ సినిమాలో అల్లు అర్జున్ స్థానంలో కార్తీక్ ఆర్యన్‌ను ఎంపిక చేసినట్టు తెలుస్తున్నది.

మనదేశంలో కరోనా లాక్‌డౌన్ కొనసాగతుండటంతో హిందీ స్క్రిప్టును ఇటీవల వీడియో కాల్ ద్వారా హీరో కార్తీక్ ఆర్యన్‌ విన్నాడట. కార్తీక్ స్క్రిప్ట్ విని సానుకూలంగా స్పందించాడని బాలీవుడ్ మీడియా వెల్లడించింది. లాక్‌డౌన్ పూర్తికాగానే షూటింగ్ చేయడానికి అనుగుణంగా డేట్లు, షెడ్యూల్ వివరాలను కార్తీక్ కన్ఫర్మ్ చేస్తాడని సమాచారం. కార్తీక్ ఆర్యన్ ఇప్పటికే దోస్తానా2 మూవీ పూర్తిచేసాడు. భూల్ భులయ్యా2 కూడా చివరి దశలో ఉందని బాలీవుడ్ మీడియా తెలిపింది. అలాగే బాలీవుడ్ లో మరో భారీ చిత్రానికి కార్తీక్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. అలాగే అల వైకుంఠపురంలో షూటింగ్‌లో పాల్గొనేందుకు ఎంతో ఆసక్తిగా ఉన్నాడట. చూడాలి మరి కార్తీక్ ఎలా మెప్పిస్తాడో..!