Begin typing your search above and press return to search.

96 దర్శకుడితో కార్తీ న్యూ మూవీ 

By:  Tupaki Desk   |   20 Jan 2023 2:30 AM GMT
96 దర్శకుడితో కార్తీ న్యూ మూవీ 
X
ఆవారా సినిమాతో తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టిన హీరో కార్తీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సూర్య తమ్ముడిగానే ఇండస్ట్రీకి వచ్చినప్పటికీ.. తన అందం, అభినయంతో తనకంటూ ప్రత్యేకంగా అభిమానులను సొంతం చేసుకున్నాడు కార్తీ. తన మూడో సినిమా నుంచే తెలుగులోనూ తన చిత్రాలను విడుదల చేస్తూ వస్తున్నాడు. తన యాక్టింగ్ తో పాటు ఆటిట్యూడ్ తో అందరికీ నచ్చేశాడు. గతేడాది మూడు హిట్లు కొట్టిన కార్తీ.. ఈ ఏడు కూడా అలాగే దూసుకుపోయేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. ప్రస్తుతం జపాన్ సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్నాడు.

ఈ సినిమా చిత్రీకరణ జరుగుతుండగానే.. కార్తీకి మరో అవకాశం వచ్చింది. అదే 96 సినిమా డైరెక్టర్ ప్రేమ్ కుమార్ తో కార్తి తన నెక్స్ట్ మూవీని చేయబోతున్నట్లు సమాచారం. ఇటీవలే డైరెక్టర్ ప్రేమ్ కుమార్ చెప్పిన కథ బాగా నచ్చడంతో కార్తీ వెంటనే ఈ సినిమా మొదలు పెట్టాలని చూస్తున్నాడట.

ఈ సినిమా సూర్య సొంత బ్యానర్ అయిన 2డీ ఎంటర్టైన్ మెంట్స్ పలో రూపుదిద్దుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే ఇందుకు సంబంధించిన విషయాలపై త్వరలోనే ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

డైరెక్టర్ ప్రేమ్ కుమార్ రూరల్ బ్యాక్ డ్రాప్ నేపథ్యంలో ఈ సినిమా కోసం కథ రాసుకున్నాడట. కార్తీ ఈ చిత్రంలో మధురైకి చెందిన వాడిగా నటించనున్నాడని టాక్. ఈ ఏడాది మధ్యలో ఈ సినిమా షూటింగ్ పట్టాలు ఎక్కబోతున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమాకు జల్లికట్టు అనే పేరును కూడా ఖరారు చేశారు. ఇక ప్రేమ్ కుమార్ 96 సినిమాను తెలుగులో శర్వానంద్, సమంతతో కలిసి జాను గా రీమేక్ చేశాడు. తమిల్ లో విజయ్ సేతుపతి, త్రిషలతో తీయగా.. సూపర్ డూపర్ హిట్టుగా నిలిచింది.

2018లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. 50 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్లను సాధించింది. గోవింద్ వసంత సంగీతం 96 సినిమాకు హైలెట్ గా నిలిచింది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం కార్తీతో తీయబోతున్న సినిమా కూడా 96 సినిమాను మించి ఉంటుందని చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కచ్చితంగా హిట్టు కొట్టాలని కసితో ఉన్న డైరెక్టర్ ప్రేమ్ కుమార్.. ఈ చిత్రంపై ప్రత్యేక దృష్టి పెట్టారట.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.