Begin typing your search above and press return to search.

నాగార్జునకి కేర్‌ టేకర్‌గా కార్తీ

By:  Tupaki Desk   |   20 Jan 2015 12:04 PM IST
నాగార్జునకి కేర్‌ టేకర్‌గా కార్తీ
X
నాగార్జున, కార్తీ హీరోలుగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ మల్టీస్టారర్‌ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. తమన్నా కథానాయికగా ఎంపికైంది. పివిపి సినిమాస్‌ పతాకంపై పివిపి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే స్క్రిప్టు వర్క్‌ పూర్తయింది. త్వరలోనే దుబాయ్‌లో 40రోజుల పాటు చిత్రీకరణకు రంగం సిద్ధం చేస్తున్నారు. అక్కడ ఓ భారీ ఇంటి కోసం వెతుకుతున్నారు. ఈ చిత్రంలో నాగార్జున ఓ భయానక వ్యాధి(క్వాడ్రిప్లెజిక్‌ పేషెంట్‌ అని పిలుస్తారు)కి గురైన పేషెంట్‌గా నటిస్తున్నారు. అతడి కేర్‌టేకర్‌ పాత్రలో కార్తీ నటిస్తున్నారు. ది ఇన్‌టచబుల్స్‌ అనే ఫ్రెంచి సినిమా ఈ చిత్రానికి ఆధారం. తెలుగు, తమిళ్‌ నేటివిటీకి అనుగుణంగా కథను, కథనాన్ని మార్పు చేర్పులు చేసి ఆన్‌సెట్స్‌ వెళ్లడానికి రెడీ అవుతున్నారు. నాగార్జున ఇప్పటికే మనం లాంటి ప్రయోగాత్మక చిత్రంలో నటించారు. అలాగే కళ్యాణ్‌ అనే కొత్త కుర్రాడు వినిపించిన ప్రయోగాత్మక చిత్రంలో ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఇప్పుడు పేషెంటుగా మరో ప్రయోగం చేయడానికి రెడీ అయ్యారు. నాగార్జున ప్రయోగాల హీరో. అతడు నటించిన గీతాంజలి చిత్రంలో మరణానికి దగ్గరవుతున్న వీరప్రేమికుడిగా నటించి మెప్పించారు. ఇప్పుడు మరోసారి వ్యాధిగ్రస్తుడిగా నటించడం ఫిలింసర్కిల్స్‌లో చర్చనీయాంశమవుతోంది.