Begin typing your search above and press return to search.

బన్నీ సీనియర్ ఇలా స్పందించాడు!

By:  Tupaki Desk   |   24 Sept 2016 12:27 PM IST
బన్నీ సీనియర్ ఇలా స్పందించాడు!
X
సినిమా ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచీ అల్లూ అర్జున్ తనకు మంచి మిత్రుడని.. తమన్నా, కాజల్ సహా తామంతా మంచి ఫ్రెండ్స్ మని చెబుతున్నాడు హీరో కార్తీ. తమిళనటుడు అయినప్పటికీ దాదాపు తెలుగు హీరోల స్థాయిలో తెలుగు వారికి దగ్గరైన కార్తీ.. నాగార్జున ను అయితే ఏకంగా అన్నయ్య లాంటి వారని కూడా అన్నాడు. ఇదే సమయంలో బన్నీ గురించిన ఆసక్తికరమైన విషయం కూడా చెప్పాడు బన్నీ.. అది కూడా నేటి విషయం కాదు, స్కూల్ నాటి విషయం!

అవును.. స్కూల్లో చదువుకుంటున్న రోజుల్లో బన్నీ - కార్తీకి జూనియర్ అట. ఈ విషయం తెలిసిన వెంటనే ఆశ్చర్యానికి ఆనందానికీ గురయ్యాయని చెబుతున్నాడు కార్తీ. ఈ సమయంలో తమ సొంత బ్యానర్లో అల్లూ అర్జున్ తో కలిసి సినిమా చేయడం ఆనందంగా ఉందని, త్వరలో అన్నయ్య సూర్యతో కలిసి నటిస్తానని చెప్పాడు. ప్రస్తుతం ప్రముఖ కాఫీ బ్రాండ్ బ్రూ రోస్ట్ అండ్ గ్రండ్ సరికొత్త ప్యాక్ ను ఆవిష్కరించే కార్యక్రమంలో భాగంగా హైదరబాద్ బేగంపేటలో సందడి చేశారు కార్తీ.

ఈ సందర్భంగా సినిమా విషయాలు ముచ్చటించిన కర్తీ... ప్రస్తుతం తమిళంలో ఒక సినిమా చేస్తున్నట్లు చెప్పాడు. ఇదే సమయంలో బన్నీ తమ బ్యానర్లో నటించడంపై ఆనందం వ్యక్తం చేశాడు. కాగా... లింగు స్వామి దర్శకత్వంలో స్టూడియో గ్రీన్ ప్రొడక్షన్ పతాకంపై బన్నీ హీరోగా జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్న సినిమా చెన్నైలో ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ సినిమా తెలుగు, తమిళ బాషల్లో ఒకేసారి నిర్మించబడుతుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/