Begin typing your search above and press return to search.

కార్తీ సరికొత్త లుక్.. అభిమానులు షాక్

By:  Tupaki Desk   |   16 Dec 2020 1:19 PM GMT
కార్తీ సరికొత్త లుక్.. అభిమానులు షాక్
X
తమిళ హీరో కార్తీ పేరు వినగానే అభిమానులతోపాటు ప్రేక్షకులకూ మదిలో అతని స్మైలింగ్ ఫేసే మెదులుతుంది. హ్యాండ్సమ్ లుక్ తో అతను నవ్వే నవ్వుకు చాలా మంది ఫిదా అయిపోతారు. అయితే.. కార్తీ లేటెస్ట్ లుక్ చూసి అభిమానులు షాక్ గురవుతున్నారు. ఏంటీ.. ఇతను మా కార్తీనేనా..? అని ఆశ్చర్య పోతున్నారు. కార్తీ న్యూలుక్ కు సబంధించిన రెండు ఫొటోలు సోషల్ మీడియాలో ఈ ఉదయం నుంచి వైరల్ అయ్యాయి. నెరిసిన గడ్డం.. బ్రౌన్ కలర్ లాంగ్ హెయిర్ తో 50 ఏళ్ల వ్యక్తిగా కనిపిస్తున్నారు కార్తీ. తన సోదరుడు సూర్య నిర్మిస్తున్న కొత్త చిత్రం ప్రారంభోత్సవంలో కార్తీ లేటెస్ట్ లుక్ కెమెరాకు చిక్కాయి.

అయితే.. ఇదేదైనా సినిమాకు సబంధించిన లుక్ అయి ఉంటుందా? అనే చర్చ సాగుతోంది. ఖైదీ, తంబి (తెలుగులో దొంగ) వంటి వరుస విజయాలను అందుకున్న కార్తీ నెక్స్ట్ మూవీ.. ‘సుల్తాన్’ విడుదలకు సిద్ధమవుతోంది. ఇక, మణిరత్నం-కార్తీ కాంబినేషన్ లో రూపొందుతున్న హిస్టారికల్ మూవీ చిత్రీకరణ జనవరి నుండి తిరిగి ప్రారంభం కానుంది. మరి, ఈ లుక్ దేనికి సంబంధించిన్నది తెలియాల్సి ఉంది.