Begin typing your search above and press return to search.

ప‌వ‌ర్ ఫుల్ గా 'ఖాకీ' ఫ‌స్ట్ లుక్‌!

By:  Tupaki Desk   |   30 Jun 2017 5:01 PM GMT
ప‌వ‌ర్ ఫుల్ గా ఖాకీ ఫ‌స్ట్ లుక్‌!
X
ప‌వ‌ర్ పుల్ పోలీస్ స్టోరీల‌కు చెర‌గ‌ని ఆద‌ర‌ణ ఉంటుంది. అందులోకి అక్ర‌మార్కుల‌పై క‌స్సుమ‌నే పోలీసు పాత్ర‌ను కొంద‌రు హీరోలు చేస్తేఆ కిక్కే వేరుగా ఉంటుంది. ప‌వ‌ర్ ఫుల్ పోలీస్ పాత్ర‌తో బంప‌ర్ హిట్ కొట్టేసిన హీరో.. మ‌ళ్లీ అదే త‌ర‌హాలో ప‌వ‌ర్ ఫుల్ పాత్ర‌ పోషిస్తుంటే ఆ చిత్రం మీద అంచ‌నాలు భారీగా ఉంటాయి.

విక్ర‌మార్కుడు త‌మిళ్ వెర్ష‌న్ లో పోలీస్ పాత్ర‌తో ప్రేక్ష‌కుల మ‌దిని దోచుకున్న కార్తీ.. తాజాగా మ‌రోసారి ప‌వ‌ర్ ఫుల్ పోలీస్ పాత్ర‌ను పోషిస్తున్నారు. ర‌కుల్‌ ప్రీత్ సింగ్ తో జ‌త క‌ట్ట‌నున్న ఈ మూవీ త‌మిళ్ లో తీర‌న్ అదిగ‌ర‌మ్ ఒండ్రు పేరుతో రెఢీ అవుతుంటే.. ఆ చిత్రాన్ని తెలుగులో ఖాకీ పేరిట విడుద‌ల చేస్తున్నారు.

మ‌రింత ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే దాదాపు రెండు ద‌శాబ్దాలుగా మ్యూజిక్ ఇండ‌స్ట్రీలో త‌మ‌దైన మార్క్ వేసిన ఆదిత్య మూజిక్ ఖాకీ చిత్రాన్ని తెలుగులోకి తీసుకొస్తోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫ‌స్ట్ లుక్ విడుద‌లైంది. ధీమాగా రొమ్ము బిగించి గ‌న్ ప‌ట్టుకొన్న ఫోజ్ తో పాటు.. సీరియ‌స్ గా తుపాకీని గురి పెట్టిన చిత్రం సినిమా ఎలా ఉంటుందో చెప్ప‌క‌నే చెప్పేసేలా ఉంది. ఖాకీ.. ద ప‌వ‌ర్ ఆఫ్ పోలీస్ ట్యాగ్ లైన్లో రానున్న ఈ చిత్రం ఆగ‌స్టు చివ‌రి వారంలో కానీ.. సెప్టెంబ‌రు మొద‌టి వారంలో అయినా విడుద‌ల కానుంద‌ని చెబుతున్నారు. మ్యూజిక్ రంగంలో త‌మ‌దైన మార్క్ వేసిన ఆదిత్య‌.. ఖాకీతో తెలుగు ప్రేక్ష‌కుల మ‌దిని ఎంత‌లా దోచుకుంటుందో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/