Begin typing your search above and press return to search.

దేవ్ రిలీజ్ ఆ రోజే అంటున్న నిర్మాతలు

By:  Tupaki Desk   |   13 Jan 2019 10:09 AM GMT
దేవ్ రిలీజ్ ఆ రోజే అంటున్న నిర్మాతలు
X
తమిళ హీరో కార్తి ప్రస్తుతం 'దేవ్' అనే సినిమాలో నటిస్తున్నాడు. నూతన దర్శకుడు రజత్ రవిశంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఈమధ్యే కంప్లీట్ అయింది.. పోస్ట్ ప్రొడక్షన్ జోరుగా సాగుతోంది. కొద్దిరోజుల క్రితం తమిళ వెర్షన్ ఆడియోను కూడా విడుదల చేశారు. ఈ సినిమాకు హ్యారిస్ జయరాజ్ సంగీతం అందరినీ ఆకట్టుకుంటోంది. తెలుగు వెర్షన్ ఆడియో ను జనవరి 14 న విడుదల చేస్తామని ఇప్పటికే ప్రకటించారు.

ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా విడుదల తేదీని నిర్మాతలు ప్రకటించారు. వ్యాలెంటైన్ డే సందర్భంగా ఫిబ్రవరి 14 న 'దేవ్' ప్రేక్షకులముందుకు తీసుకొస్తారట. మొదట ఈ సినిమాను ఫిబ్రవరి మొదటివారంలో విడుదల చేసేందుకు ప్లాన్ చేసినా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఆలస్యం అవుతున్న కారణంగా ఫిబ్రవరి 14 కు విడుదల చేయాలని నిర్ణయించారట. ఈ సినిమా లవ్.. యాక్షన్ ఎలిమెంట్స్ ఉండే రోడ్ థ్రిల్లర్ గా గా తెరకెక్కిందని.. ప్రేక్షకులకు తప్పనిసరిగా నచ్చుతుందని నమ్మకంగా ఉన్నారు.

లెజెండరి క్రికెటర్ కపిల్ దేవ్ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు ఈ సినిమా కథకు ప్రేరణగా తీసుకున్నారట. ఈ సినిమాలో కార్తికి జోడీగా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తోంది. రమ్యకృష్ణ.. ప్రకాష్ రాజ్ ఈ సినిమాలో ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రిన్స్‌ పిక్చర్స్‌ బ్యానర్ పై ఎస్‌.లక్ష్మణన్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.