Begin typing your search above and press return to search.

బిపాషా యోగా బిల్లు..45 లక్షలంట

By:  Tupaki Desk   |   12 July 2016 5:06 AM GMT
బిపాషా యోగా బిల్లు..45 లక్షలంట
X
ఓ రెండు నెలల క్రితమే బిపాషా బసు పెళ్లి చేసుకుని.. రీసెంట్ గా హనీమూన్ కూడా పూర్తి చేసుకుంది. గత నెలలో ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా జరిగిన ఓ యోగా ఈవెంట్ లో ఈ హాటీ ఆకట్టుకుంది. బెంగళూరులోని కంటీరవ స్టేడియంలో ఓ భారీ యోగ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ అట్రాక్షన్ బిపాసా బసునే. అత్యంత క్లిష్టమైన యోగ మూమెంట్స్ ని కూడా అలవోకగా చేసి చూపించింది. పలువురు రాజకీయ నాయకులు కూడా హాజరైన ఈ ఈవెంట్.. భారీ సక్సెస్ కావడానికి కారణం బిపాషా బసునే.

అసలు వివాదం ఆ తర్వాత మొదలైంది. దీన్ని నిర్వహించిన ఆర్గనైజర్లు.. ఏకంగా 45 లక్షల రూపాయలకు గవర్నమెంట్ కి బిల్ కోట్ చేశారు. ఒక కార్యక్రమం కోసం ఇంతమొత్తం అనగానే వివాదం చెలరేగింది. ఇప్పటికే ఈ మొత్తాన్ని చెల్లించబోయేది లేదని.. మరింత వివరంగా బిల్స్ ప్రొడ్యూస్ చేయాలని కర్నాటక రాష్ట్ర ప్రభుత్వం చెప్పేసింది. అయినా సరే.. ఈ మొత్తంలో చాలావరకూ బిపాషాకు చెల్లించేందుకే అడుగుతున్నారనే టాక్ వినిపిస్తోంది. ఈ వివాదంపై బిప్స్ సన్నిహితులు చెబుతున్న వెర్షన్ మాత్రం వేరేలా ఉంది.

'యోగాను ప్రమోట్ చేసేందుకే ఈ కార్యక్రమానికి బిపాషా హాజరైంది. ఆరోగ్యం - శారీరక ధృడత్వంపై యువతలో ప్రచారం చేయడమే ఆమె ఉద్దేశ్యం. అసలు భారీ రెమ్యూనరేషన్ అనే మాట లేనే లేదు. ఈ వివాదంలో అనవసరంగా బిపాషాను ఇరికించారు' అంటున్నారు బిప్స్ సన్నిహితులు.