Begin typing your search above and press return to search.

'కర్ణన్' రిలీజ్ డేట్ కన్ఫర్మ్.. ఎప్పుడంటే??

By:  Tupaki Desk   |   7 April 2021 6:30 AM GMT
కర్ణన్ రిలీజ్ డేట్ కన్ఫర్మ్.. ఎప్పుడంటే??
X
ఈ కరోనా సమయంలో అనుకున్న సినిమాలన్ని అనుకున్న రోజున రిలీజ్ అవ్వడం కష్టమే అయిపోయింది. ఎందుకంటే మహమ్మారి కారణంగా గతేడాది విడుదల కావాల్సిన సినిమాలే ఈ ఏడాదికి వాయిదా వేసుకున్నారు. అలాంటిది ఇప్పుడు కూడా కరోనా వ్యాప్తి చెందుతుండటంతో థియేటర్లకు జనాలు వచ్చే సూచనలు కనిపించడం లేదు. అలాగని 100% సీటింగ్ అనేది కూడా కష్టమే. కానీ పలు సినిమాలు ఇలాంటి సమయంలో కూడా రిలీజ్ కు సిద్ధం అవుతున్నాయి. ఎందుకంటే ఇదివరకే వాయిదా పడుతూ వచ్చాయి. కొందరేమో థియేటర్లో కాకుండా డిజిటల్ రిలీజ్ చేస్తామని నిర్ణయించుకున్నారు. తాజాగా తమిళ స్టార్ హీరో ధనుష్ నటించిన తాజాచిత్రం 'కర్ణన్' రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు.

నిజానికి ఫిబ్రవరిలోనే కర్ణన్ రిలీజ్ డేట్ ప్రకటించారు మేకర్స్. అయితే మధ్యలో సినిమా కరోనా కారణంగా డిజిటల్ రిలీజ్ కాబోతుందని సందేహాలు వ్యక్తమయ్యాయి. కానీ ఖచ్చితంగా కర్ణన్ సినిమా థియేట్రికల్ రిలీజ్ చేస్తామని మేకర్స్ తేల్చిచెప్పేసారు. అప్పుడే సినిమా రిలీజ్ పోస్టర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. తాజాగా మరోసారి కన్ఫర్మ్ చేస్తూ.. విడుదల తేదీలో ఎలాంటి మార్పులు లేవని చెప్పేసారు. కర్ణన్ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 9న రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అలాగే సినిమా పై అంచనాలను కూడా పెంచేసింది. అవార్డు విన్నింగ్ 'పెరియారుమ్ పెరుమాల్' మూవీని తెరకెక్కించిన మారి సెల్వరాజ్ ఈ సినిమాను కూడా రూపొందించాడు. హార్డ్ హిట్టింగ్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కిన కర్ణన్ పోస్టర్ చూస్తే వందలమంది మధ్యలో ధనుష్ మెరుస్తున్న కత్తి పట్టుకొని కూర్చోవడం మనం చూడవచ్చు. ఈ సినిమాను కలైపులి ఎస్ థాను నిర్నిస్తుండగా.. సంతోష్ నారాయణన్ సంగీతం అందించాడు.