Begin typing your search above and press return to search.
ఆ స్టార్ హీరో.. మళ్లీ రక్తపాతమే
By: Tupaki Desk | 20 April 2020 10:00 PM ISTతమిళంలో కమర్షియల్ సినిమాలే చేసినా వాటిలో ఏదో ఒక కొత్తదనం ఉండేలా చూసుకునే హీరో ధనుష్. చూడ్డానికి బక్కగా.. పీలగా.. ఇతనేం హీరో అనిపించేలా ఉంటాడు కానీ.. తెరపై అతను హీరోయిజాన్ని ఓ రేంజిలో పండిస్తాడు. అతడి సినిమాలు చాలా వరకు వయొలెంటుగా ఉంటాయి. రక్తంలో తడిసి ముద్దయిపోయే క్యారెక్టర్లంటే ధనుష్ కు బాగా ఇష్టం. గత ఏడాది వచ్చిన ‘అసురన్’ సినిమాలో అతనెలా రక్తపాతం సృష్టించాడో తెలిసిందే. ఇప్పుడు మళ్లీ ధనుష్ అలాంటి పాత్రే ఎంచుకున్నట్లున్నాడు. గత ఏడాది తమిళం నుంచి వచ్చిన అత్యుత్తమ చిత్రాల్లో ఒకటిగా నిలవడమే కాక జాతీయ అవార్డు కూడా గెలిచిన ‘పరియేరుమ్ పెరుమాళ్’ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయిన మారి సెల్వరాజ్ దర్శకత్వంలో ధనుష్ నటిస్తున్న కొత్త చిత్రం ‘కర్ణన్’. తాజాగా ఈ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు.
ఈ మోషన్ పోస్టర్ మొదలు కావడంతోనే ఒక కత్తి వేటుకు తల తెగిపడ్డ దృశ్యం కనిపించింది. ఆ తర్వాత ధనుష్ ఆ కత్తినే పట్టి శత్రువుల్ని చీల్చి చెండాడే దృశ్యం చూపించారు. ముఖానికి గుడ్డ చుట్టిన లుక్ లో ధనుష్ వయొలెంట్ గా కనిపించాడు మోషన్ పోస్టర్ లో. దీన్ని బట్టి చూస్తే ‘అసురన్’ తరహాలోనే అన్యాయానికి గురైన ఓ సామాన్యుడు ఉగ్రరూపం దాలిస్తే ఎలా ఉంటుందో ఈ సినిమాలో చూపించేట్లున్నారు. ధనుష్ ఫేవరెట్ డైరెక్టర్ - అతడితో మూడు సినిమాలు తీసిన వెట్రిమారన్.. ఎక్కువగా అతణగారిన వర్గాలకు చెందిన కథల్నే సినిమాలుగా తీశాడు. ‘కబాలి’ దర్శకుడు పా.రంజిత్ శిష్యుడైన మారి సెల్వరాజ్ కూడా ఈ తరహా కథతోనే దర్శకుడిగా అరంగేట్రం చేశాడు. కాబట్టి వీళ్ల కలయికలో వచ్చే సినిమా కూడా అదే టైపులో ఉంటుందనిపిస్తోంది. ‘కర్ణన్’ పూర్తయ్యాక వెట్రిమారన్ దర్శకత్వంలో ‘వడ చెన్నై’ సీక్వెల్లో ధనుష్ నటించాల్సి ఉంది.