Begin typing your search above and press return to search.

కరిష్మాకు స్మాల్ బితో లింకంటున్న భర్త

By:  Tupaki Desk   |   17 Jan 2016 9:00 PM IST
కరిష్మాకు స్మాల్ బితో లింకంటున్న భర్త
X
ప్రముఖ బాలీవుడ్ జంటల మధ్య విభేదాలు మామూలే. పెళ్లి చేసుకోవటం.. విడిపోవటం సాధారణ అంశాలే. అయితే.. నాలుగు గోడల మధ్య జరిగే విషయాల్ని పబ్లిక్ గా చర్చకు పెట్టి రచ్చ చేయటం చాలా అరుదుగా జరుగుతుంటుంది. అలాంటి ఉదంతమే తాజాగా చోటు చేసుకుంది. ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ కరిష్మా కపూర్ భర్త సంజయ్ తాజాగా ఆమె చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి.

వీరిద్దరి వైవాహిక జీవితంలో తేడాలు రావటంతో వీరు విడిపోవాలని నిర్ణయించుకున్నారు. ఇందుకు తగ్గట్లే ఈ జంట విడాకులకు దరఖాస్తు చేసుకుంది. అయితే.. కరిష్మా తనను డబ్బు కోసమే పెళ్లి చేసుకుందని.. ఫిర్యాదు చేసిన సంజయ్ తాజాగా ఆమెకు స్మాల్ బి అభిషేక్ బచ్చన్ తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నారు.

తనతో పెళ్లికి ముందు అభిషేక్ బచ్చన్ తో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లుగా చెప్పిన సంజయ్.. అతనితో విడిపోయినాకే తనను పెళ్లి చేసుకున్నట్లుగా కోర్టుకు వెల్లడించాడు. భార్యగా.. తల్లిగా కరిష్మా విఫలమైందని ఆరోపించిన అతగాడు.. ఇంటిని కూడా గ్లామర్ ప్రపంచంగా మార్చాలని కరిష్మా ప్రయత్నించిందని ఆరోపించాడు. సంజయ్ ఆరోపణల్ని కరిష్మా లాయర్లు తీవ్రంగా ఖండించారు. ఖండనల సంగతి పక్కన పెడితే.. ఇంతకాలం కాపురం చేసిన భార్యను తక్కవ చేసేలా.. ఆమె మీద మచ్చ పడేలా వ్యాఖ్యలు చేసిన సంజయ్ తీరు ఏ మాత్రం బాగోలేదన్న మాట వినిపిస్తోంది. విడిపోవాలనుకున్నప్పుడు హుందాగా విడిపోతే బాగుంటుంది కానీ ఈ అనవసర రచ్చేందన్న మాట పలువురి నోట రావటం గమనార్హం.