Begin typing your search above and press return to search.

ఫోటో స్టొరీ: బికినీ నెం. 1

By:  Tupaki Desk   |   26 Jun 2019 5:33 AM GMT
ఫోటో స్టొరీ: బికినీ నెం. 1
X
పాత హిందీ సినిమాలు చూసేవారికీ తప్ప ఈ జెనరేషన్ ప్రేక్షకులకు కరిష్మా కపూర్ పేరు పెద్దగా తెలిసి ఉండే అవకాశం లేదు. మహా అయితే కరీనా కపూర్ అక్కగా మాత్రం తెలిసి ఉంటుంది. కానీ కరిష్మా 90లో బాలీవుడ్ ను ఒక ఊపు ఊపేసిన హీరోయిన్. దాదాపుగా టాప్ హీరోస్ అందరితో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్లోనటించి బాలీవుడ్ లో తన సత్తా చాటింది. 'జిగర్'.. 'రాజా హిందుస్తాని'.. 'దిల్ తో పాగల్ హై'.. 'హీరో నెం.1'.. 'కూలీ నెం. 1'..'బీవి నెం. 1'.. ఇలా చెప్పుకుంటూ పోతే ఆమె లిస్టులో చాలా హిట్ సినిమాలు ఉన్నాయి. సరే.. ఇప్పుడు ఇంత లెంగ్తీ ఇంట్రో ఎందుకు వచ్చిందంటే.. ఈరోజు కరిష్మా కపూర్ 45 వ పుట్టిన రోజు.

అయితే ఎంత సీనియర్ బ్యూటీ అయినా కరిష్మా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా అప్డేట్స్ ఇస్తూ.. గ్లామరస్ ఫోటోలు పోస్ట్ చేస్తూ ఫ్యాన్స్ తో నిత్యం టచ్ లో ఉంటుంది. ఈ పుట్టినరోజు సందర్భంగా కరిష్మా తన ఇన్స్టా ఖాతా ద్వారా ఒక బికిని ఫోటో పోస్ట్ చేసి 'ఏ వయసులోనైనా మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి' అనే సందేశాన్ని ఇచ్చింది. ఈ ఫోటోలో కరిష్మా ఓ అందమైన బ్లాక్ బికినీ ధరించి ఒక బీచ్ రిసార్టులోని స్విమ్మింగ్ పూల్ దగ్గర పడుకొని ఆకాశంలోకి చూస్తూ ఒక కిరాక్ పోజిచ్చింది. కరిష్మా అని చెప్పకుండా.. వయసు నలభై ఐదు అని చెప్పకుండా.. ఎవరికైనా ఈ ఫోటో చూపించి 'ఈ బికిని పాప వయసెంత?' అని అడిగితే ఎవరు కూడా అసలు వయసును గెస్ చేయలేరు!

ఈ ఫోటోకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. "మై చైల్డ్ హుడ్ క్రష్".. "అంత ఫిట్నెస్.. ఎలా ఎలా?".. "లోలో ఈజ్ సూపర్ హాట్" అంటూ కామెంట్లు పెట్టారు. లాస్ట్ కామెంట్ లో లోలో ఏంటో తెలుసా? కరిష్మా ముద్దు పేరు లోలో. కరిష్మా రీసెంట్ గా షారూఖ్ ఖాన్ చిత్రం 'జీరో' లో ఒక స్పెషల్ సాంగ్ లో తళుక్కున మెరిసింది. కరిష్మా ప్రస్తుతం 'మెంటల్ హుడ్' అనే వెబ్ సీరీస్ లో నటిస్తోందని సమాచారం.