Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: టివి సోయగం సొగసులివే

By:  Tupaki Desk   |   29 March 2018 6:02 PM GMT
ఫోటో స్టోరి: టివి సోయగం సొగసులివే
X

సీరియల్ నటీమణులు బుల్లితెరపై ఎంత ట్రెడిషనల్ లుక్ తో కనిపిస్తారో అందరికి తెలిసిందే. కానీ వారిలో కొందరు గ్లామర్ లుక్ తో కనిపించారంటే స్టార్ హీరోయిన్స్ కి ఏ మాత్రం తీసిపోరు. హీరోయిన్స్ కంటే వారే ఎక్కువా అందంగా ఉంటారని చెప్పవచ్చు. ముఖ్యంగా నార్త్ అమ్మాయిలు అయితే సీరియల్స్ లో నటిస్తూనే మరో వైపు సినిమాల్లో గ్లామర్ పాత్రలను కూడా చేస్తుంటారు. అయితే మొన్నటి వరకు కాస్త డిసెంట్ లుక్స్ తో కనిపించిన ఓ బుల్లితెర నటి అందరికి షాక్ ఇచ్చింది.

ఇటీవల ఫొటోల్లో ఆ నటి ఇచ్చిన స్టిల్ చూపు తిప్పుకొనివ్వకుండా చేస్తోంది. ఆమె ఎవరో కాదు. కరిష్మా తన్నా. క్యూంకీ సాస్ భీ కభి బహు థి - నాగార్జున ఎక్ యోదా వంటి సీరియల్స్ లో నటించి అందరిని ఎంతగానో ఆకట్టుకుంది ఈ సుందరి. పలు రియాలిటీ షోలతో పాటు సినిమాల్లో కూడా మెరిసింది. అయితే ఇన్నోసెంట్ గా కనిపించే కరిష్మా ఒక్కసారిగా మోడ్రన్ డ్రెస్ లో హాట్ గా కనిపించి కుర్రకారుకు కనువిందు చేసింది. పైన ఒక జాకెట్ ఉంచి లెగ్స్ అందాలను బ్లాక్ డ్రెస్ లో ఘాటుగా ఆరబోసింది. ఆమె ఇచ్చిన స్టిల్ అయితే చాలా సెక్సీ గా ఉందని నెటీజన్స్ చాలా కామెంట్స్ చేస్తున్నారు.

మూడు పదుల వయసు దాటినా కూడా అమ్మడు ఇంకా పాతికేళ్ల అమ్మాయిలనే ఉందని ఓ వర్గం వారు లవ్ ఎమోజీలను తగిలించేస్తున్నారు. హీరోయిన్ గా కొనసాగాలనే ఆశతో కరిష్మా ఈ విధంగా ఫొటో షూట్స్ ఇస్తోంది. ప్రస్తుతం అయితే రెండు చిన్న హిందీ సినిమాల్లో నటిస్తోంది ఈ టివి సోయగం.