Begin typing your search above and press return to search.

బుల్లితెర హాట్ బాంబ‌ర్ పూల్ సైడ్ ట్రీట్

By:  Tupaki Desk   |   10 Jan 2022 12:30 AM GMT
బుల్లితెర హాట్ బాంబ‌ర్ పూల్ సైడ్ ట్రీట్
X
అందానికి అందం.. వేడెక్కించే వ‌య్యారం.. ఈ టాప్ మోడ‌ల్ కం న‌టిలో ఉన్నాయంటే అతిశ‌యోక్తి కాదు. పేరు క‌రిష్మా త‌న్నా. బుల్లితెర‌.. వెండితెర న‌టిగా సుప‌రిచితం. మోడల్ కం టీవీన‌టి క‌రిష్మా త‌న్నా ఇంత‌కుముందు టాలీవుడ్ కింగ్ నాగార్జున సినిమాలో అతిథి పాత్ర‌లో మెరిసింది. బాలీవుడ్ లో గ్రాండ్ మ‌స్తీ.. సంజు వంటి చిత్రాల్లో అద్భుత న‌ట‌న‌తో మైమ‌రిపించింది. `సురాజ్ పే మంగ‌ళ్ బ‌రీ` అనే చిత్రంలో అతిథిగా న‌టించింది. అలాగే `లాహోర్ కాన్ఫిడెన్షియ‌ల్` అనే థ్రిల్ల‌ర్ మూవీలోనూ నాయిక‌గా న‌టిస్తోంది. కరిష్మా తన్నా ఇన్ స్టాగ్రామ్ లో చాలా యాక్టివ్ గా ఉన్నారు. బికినీ బీచ్ సెల‌బ్రేష‌న్స్.. విహారయాత్రలకు సంబంధించిన ఫోటోల్ని రెగ్యుల‌ర్ గా అప్ డేట్ చేస్తుంటుంది. తాజాగా పూల్ సైడ్ హీటెక్కించే ఫోటోగ్రాఫ్స్ ని క‌రిష్మా షేర్ చేయ‌గా అవి వెబ్ ని షేక్ చేస్తున్నాయి. ఈ ఫోటోగ్రాఫ్ లో బ్లూ బికినీలో థైషోస్ తో అద‌ర‌గొట్టింది త‌న్నా. త‌న్నా అంద‌చందాల‌కు తానా తందానా! అనేస్తున్నారు యూత్. క‌రిష్మా త‌న్నా సోష‌ల్ మీడియాల్లో షేర్ చేసే జిమ్మింగ్ వీడియోల‌కు యూత్ లో మాంచి గిరాకీ ఉంది. బుల్లితెర హాట్ బాంబ‌ర్ గా ఈ బ్యూటీకి ఇమేజ్ ని పెంచుతున్నాయి ఇవ‌న్నీ.

ఇక‌పోతే క‌రిష్మా ప్ర‌ఖ్యాత లోదుస్తుల‌ బ్రాండ్ విక్టోరియా సీక్రెట్స్ కి ప్ర‌చార‌క‌ర్త‌గా ఉంది. `నాగిన్ 3` న‌టి లోదుస్తుల ప్ర‌చారానికి బుల్లితెర ఆడియెన్ క్లీన్ బౌల్డ్ అవుతున్నారు. ఇంత‌కుముందు ఇలానే ప్ర‌ఖ్యాత జువెల‌రీ బ్రాండ్ కి ప్ర‌చారం చేస్తూ.. సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ లో ఓ ఆస‌క్తిక‌ర ఫోటోని షేర్ చేయ‌గా అది అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారింది. ఆ ఫోటోలో త‌న ఎంగేజ్ మెంట్ రింగ్ ధరించి కనిపించడం ఆమె అభిమానులకు ఆసక్తి కలిగించింది. దీంతో కరిష్మా తన్నా నిశ్చితార్థం జరిగిందా? ఒక‌టే ఆరాలు మొద‌ల‌య్యాయి. అయితే అది ఓ ప్ర‌ముఖ‌ ఆభరణాల బ్రాండ్ ‌కు సంబంధించిన ప్రకటన అని ఆ తర్వాత తెలిసింది. అయితే అప్ప‌టికే త‌న‌ అనుచరులు చాలా మంది తన భాగస్వామి ఎవరో చెబుతారా? అంటూ ప్ర‌శ్నించారు. నిజంగా నిశ్చితార్థం జరిగిందా? అంటూ త‌ర‌చి త‌ర‌చి ప్ర‌శ్న‌ల‌తో ఉక్కిరి బిక్కిరి చేశారు.

కరిష్మా తన్నా తన కెరీర్‌ను 2001 సంవత్సరంలో ప్రముఖ టెలివిజన్ సీరియల్ క్యుంకి సాస్ భీ కబీ బహు థితో ప్రారంభించింది. నాగార్జున - ఏక్ యోధా.. నాగిన్ 3.. ఖయామత్ కి రాత్ షోలలో తన పాత్రలకు ప్రసిద్ది చెందింది. టెలివిజన్ సీరియల్స్ కాకుండా.. నాచ్ బలియే, ఝ‌లక్ దిక్ లాజా,... జరా నాచ్కే దిఖా వంటి అనేక రియాలిటీ సిరీస్ లలో భాగమైంది. ఖత్రోన్ కే ఖిలాడి తాజా సీజన్ ‌ను కూడా గెలుచుకుంది. రణబీర్ కపూర్ నటించిన సంజు,... గ్రాండ్ మస్తీలతో సహా కొన్ని హిందీ చిత్రాలలో కూడా నాయిక‌గా న‌టించింది.