Begin typing your search above and press return to search.

ఫోటో స్టొరీ: అమ్మడి బికినీకి మాల్దీవులు ఢమాల్

By:  Tupaki Desk   |   4 Jun 2019 1:55 PM GMT
ఫోటో స్టొరీ: అమ్మడి బికినీకి మాల్దీవులు ఢమాల్
X
కరిష్మా శర్మ పేరు గుర్తుంది కదా. కొద్ది రోజుల క్రితం అరిటాకుల మధ్య ఫసాక్ పోజిచ్చి ఇన్స్టాగ్రామ్ కు కొత్త అందాన్ని తెచ్చిన భామే ఈ కరిష్మా శర్మ. ఈ పాతికేళ్ళ ముంబై పాప 'ఎంటీవీ వెబ్డ్'.. 'కామెడి సర్కస్' లాంటి చాలా టీవీ షోస్ లో పాల్గొంది. బాలీవుడ్ లో 'ప్యార్ కా పంచనామా 2' .. 'హోటల్ మిలన్' లాంటి సినిమాల్లో నటించింది. ఎఎల్టీ బాలాజీ వారి 'రాగిణి ఎంఎంఎస్: రిటర్న్స్'. ఈ ఘాటు వెబ్ సీరీస్ లో రాగిణి పాత్ర ఈ భామను ఒక్కసారిగా హాటు భామ కేటగిరిలో టాప్ కు చేర్చింది.

తన హాట్ ఫోటోలతో సోషల్ మీడియాలో మంటలు రేపగల దిట్ట. ఈ పాప హాట్ నెస్ దెబ్బకు ఋతుపవనాలు రూట్ మార్చుకుని ఏటో వెళ్ళిపోతాయి. తాజాగా మళ్ళీ ఇన్స్టాగ్రామ్ లో తన తడాఖా చూపించింది. ఒక బికినీ ఫోటో పోస్ట్ చేసింది. "అందమైన నవ్వులు.. అలసిన పాదాలు. కాక్ టెయిల్స్.. మెరిసే సముద్రంపైనుంచి కనిపించే సాయంత్రాలు." అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఈ భామ ప్రస్తుతం మాల్దీవ్స్ లో సరదాగా గడుపుతోందట. అందుకే అక్కడ ఒక అందమైన బీచ్ లొకేషన్ లో తన అందాలను ఒడుపుగా వడ్డించింది. ఆరెంజ్ కలర్ లో ఉన్న బికినీలో బీచ్ ఇసుకలో విశ్రమిస్తూ ఒక వయ్యారమైన పోజిచ్చింది. అసలు అందం అంటే ఏంటి.. సముద్రానిదా.. సముద్రపు నీటి అలలదా.. ఆ నీటిలో ఉన్న ఇళ్ళదా.. ఇళ్ళపై ఉన్న మబ్బులదా.. మబ్బుల మధ్యనుండి వస్తున్న సూర్యకాంతిదా.. ఇవన్నీ కాక బీచ్ లో ఎక్కుపెట్టిన విల్లులా ఉన్న కరిష్మాదా?

ఈ ఫోటో ఇంత అందంగా ఉండడానికి చాలా కారణాలే ఉన్నాయి. అందులో ఒకటి బ్యూటిఫుల్ లొకేషన్. ఆ లొకేషన్ ను .. బ్యూటీని కలిపి అంతకంటే బ్యూటిఫుల్ గా క్యాప్చర్ చేసిన ఫోటోగ్రాఫర్. ఫోటోలో సగం ఎండ ఉంది. సగం మబ్బుల నీడ ఉంది. ఈ ఫోటోకు కామెంట్లు అదిరిపోయాయి. "హటీ నాటీ సెక్సీ బ్యూటీ ".. "సుందర్ అతి సుందర్".. "బాలీవుడ్ గ్లామర్ బాంబ్".. "బెస్ట్ బికినీ పిక్" అంటూ పొగడ్తలు గుప్పించారు.