Begin typing your search above and press return to search.

శర్మా.. ఇంకా రచ్చెందుకు నానా??

By:  Tupaki Desk   |   11 Nov 2017 8:45 AM GMT
శర్మా.. ఇంకా రచ్చెందుకు నానా??
X
ఇప్పుడు బాలీవుడ్ లో అయినా టాలీవుడ్ లో అయినా కూడా.. అవకాశాలు లేనప్పుడు హాట్ ఫోటోషూట్లు చేస్తే వెంటనే ఛాన్సులు వచ్చేస్తున్నాయి. కేవలం ట్విట్టర్లో బికినీ ఫోటోలు పెట్టేసి సీరత్ కపూర్.. అలాగే తన హాలీడే బికినీ ఫోటోలను షేర్ చేసిన శ్రీయ.. తద్వారా వచ్చిన క్రేజ్ కారణంగా చాలా బిజీ అయిపోయారు. బాలీవుడ్ లో కూడా టివి సీరియల్ బ్యూటి కరిష్మా శర్మ అదే పని చేస్తోంది.

అమ్మడు ఆ మధ్యన ఏకంగా లింజరీలో ఫోటోలు దిగేసి వాటిని తన సోషల్ మీడియా పేజీల్లో షేర్ చేసింది. అప్పటివరకు టివిలో హోమ్లీ గాళ్‌ తరహాలో కనిపించిన ఈ బ్యూటి.. ఒక్కసారిగా అంత హాటుగా కనిపిస్తే.. అందరూ షాకయ్యారంతే. దానితో నిర్మాత ఏక్తా కపూర్ పిలిచి మరీ ఒక రోల్ ఇచ్చింది. అంతే హాటుగా కనిపించమంటూ.. 'రాగిణి ఎం.ఎం.ఎస్ రిటర్స్' అనే వెబ్ సిరీస్ లో అవకాశం ఇచ్చింది. అమ్మడు అందులో సెమీ నూడ్ గా కూడా కనిపించేసిందిలే. ఇప్పుడు కూడా ఈ ఫోటోలో చూడండి.. అమ్మడు ఒక ట్రాన్సపెరెంట్ బికినీ వేసుకుని.. తన సోకులను ఎలా ఆరేస్తోందో..

అయితే ఇదంతా చూసినోళ్లు మాత్రం.. ఆల్రెడీ గ్లామర్ డోస్ తో మాంచి ఛాన్సులే వచ్చేశాయిగా.. మళ్లీ ఇప్పుడు ఈ ఫోటోల రచ్చ ఎందుకు అంటున్నారు. కానివ్వండి బాబూ.. అక్కడ ఆమెకు కేవలం వెబ్ సిరీస్ ఆఫర్ వచ్చిందంతే.. ఒక్క సినిమా ఛాన్స్ కూడా రాలేదుగా.. ఆమె బాధను అర్దం చేసుకోండి.