Begin typing your search above and press return to search.

విడాకులు.. అంతలోనే బాయ్ ఫ్రెండ్..

By:  Tupaki Desk   |   14 Dec 2016 12:54 PM GMT
విడాకులు.. అంతలోనే బాయ్ ఫ్రెండ్..
X
బాలీవుడ్ లో హీరోయిన్ గా వెలిగిపోయిన కరిష్మా కపూర్.. పెళ్లి చేసుకున్నాక సినిమాలకు దూరమైంది. ఈ మధ్య ఆ పెళ్లి పెటాకులు అయ్యి.. విడాకులు కూడా తీసేసుకుంది. సహజంగా ఇలాంటి సంఘటనల తర్వాత రిలేషన్స్ విషయంలో హీరోయిన్స్ ఎలర్ట్ గా ఉంటారు. అందులోనూ కపూర్ ఫ్యామిలీ వ్యక్తిగా ఇంకాస్త జాగ్రత్తలు పాటిస్తుంది ఎక్స్ పెక్ట్ చేయడంలో ఏ మాత్రం తప్పులేదు.

జూన్ నెలలో విడాకులు అందుకున్న కరిష్మా.. ఇప్పుడు కొత్త బాయ్ ఫ్రెండ్ తో చక్కర్లు కొట్టేయడం మొదలుపెట్టింది. విడాకుల కోసమే నానా హంగామా చేసిన ఈమె.. ఆ తర్వాత రెండో పెళ్లి చేసుకోనుందనే వార్తలు వచ్చాయి. వీటిపై ఎలాంటి కామెంట్స్ ఆమె నుంచి రాలేదు కానీ.. ఇప్పుడు ఓ పార్టీలో దాదాపు డిక్లరేషన్ ఇచ్చినట్లయింది. ఓ ఫార్మా కంపెనీకి సీఈఓగా ఉన్న సంతోష్ తోష్నివాల్ అనే వ్యక్తితో కరిష్మా బాగా సన్నిహితంగా మెలుగుతోందని.. ఇతన్నే వివాహమాడబోతోందనే రూమర్స్ కొన్ని వారాలుగా వినిపిస్తున్నాయి.

తాజాగా దర్శకుడు కృష్ణ డి.కె. ఇచ్చిన ఓ పార్టీకి బాయ్ ఫ్రెండ్ సంతోష్ తోష్నివాల్ తో కలిసి వచ్చేసింది కరిష్మా. వీళ్లిద్దరి వయసు 42 ఏళ్లే కావడం కేవలం యాదృచ్ఛికమేలే. అలాగని ఈ పార్టీ ఏమీ చిన్నచితగా వ్యక్తుల మధ్య జరిగింది కూడా కాదు. సైఫ్ అలీ ఖాన్, కునాల్ ఖేమ్, సోనా ఆలీ ఖాన్ లాంటి సెలబ్రిటీలు కూడా హాజరయ్యారు. వీరందరికీ తన కాబోయే భర్తను పరిచయం చేసేందుకే.. ఈపార్టీకి సంతోష్ ని కరిష్మా తీసుకొచ్చిందని బాలీవుడ్ జనాలు చెప్పుకుంటున్నారు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/