Begin typing your search above and press return to search.

45 ఏజ్ మ‌మ్మీ బికినీ ట్రీట్ ఇలా

By:  Tupaki Desk   |   26 Oct 2019 5:10 PM GMT
45 ఏజ్ మ‌మ్మీ బికినీ ట్రీట్ ఇలా
X
ఇద్దరు టీనేజర్లకు మమ్మీగా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తోంది క‌రిష్మా. 45 ఏళ్ల ఈ మ‌మ్మీ నిరంత‌రం ముంబై పార్టీ క్రౌడ్స్ లో ఎంతో యాక్టివ్ గా ఉంటార‌న్న సంగ‌తి తెలిసిందే. మ‌లైకా అండ్ గ్యాంగ్ లో కరిష్మా కూడా స‌భ్యురాలు. నిరంత‌రం ఏవో పార్టీల పేరుతో విదేశీ షికార్లు చేస్తుంటారు.

తాజాగా క‌రిష్మా ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఓ హాట్ బికినీ ఫోటో హీటెక్కిస్తోంది. 1990 లలో బి-టౌన్ పాపుల‌ర్ స్టార్ కరిష్మాలో ఇంకా వాడి వేడి ఎంత‌మాత్రం త‌గ్గ‌లేద‌ని ఈ ఫోటో చెబుతోంది. టోన్డ్ ఫిజిక్ తో పెర్ఫెక్ట్ ఫిట్ గా అందంగా కనిపిస్తోంది. క‌పూర్ గాళ్స్ ప్ర‌త్యేక‌త‌నే ఇది అని ప్రూవ్ చేస్తోంది. ఇప్ప‌టికీ క‌థానాయిక‌గా ఆఫ‌ర్ వ‌స్తే తిరిగి అద‌ర‌గొట్టేస్తుందేమో!

కరిష్మా చివరిసారిగా పెద్ద తెరపై కనిపించింది 2012 చిత్రం డేంజరస్ ఇష్క్. ఇది బాక్సాఫీస్ వద్ద ఫెయిలైంది. ఇటీవ‌లే షారూక్ జీరో (2018) చిత్రంలో అతిధి పాత్ర‌లోనూ ద‌ర్శ‌న‌మిచ్చింది. ఇక క‌రిష్మా అంటే డ్యాన్సుల‌కు ప్ర‌సిద్ధి. త‌న డ్యాన్సింగ్ మూవ్ మెంట్స్ ఆల్ టైమ్ హాట్ టాపిక్. నైన్ టీస్ లో యూత్ గుండెల్లో గ‌మ్మ‌త్త‌యిన‌ మాయాజాలాన్ని సృష్టించిన క‌రీనాని తిరిగి ఇప్పుడిలా బికినీలో చూశాక నాటి రోజుల్ని గుర్తు చేసుకుంటోంది యూత్. ఈ ఫోటోకి క‌రీనా ఇచ్చిన శీర్షిక ఆస‌క్తిక‌రం. ``సాయంత్రం ఇలాంటివి ఆస్వాధించాలి # స్ప్లాష్`` అంటూ బికినీలో ఫోజిచ్చింది. ఆ స్విమ్మింగ్ పూల్ బ్యాక్ డ్రాప్ ఆస‌క్తిక‌రం. అల్లంత దూరాన‌ సాయంత్రంపు కాంతుల‌తో భవనం ధేధీప్య‌మానంగా క‌నిపిస్తోంది. ఓ విలాసవంతమైన సూట్ లేదా అంద‌మైన విల్లాలో సెట‌ప్ ఇది.