Begin typing your search above and press return to search.
కష్టాల్లో నిర్మాత..రెండోసారి కరోనా పాజిటివ్
By: Tupaki Desk | 14 April 2020 4:00 PM ISTకాదెవరు కరోనాకు అనర్హం అన్నట్టు పరిస్థితి ఉంది. సామాన్యులే కాదు.. సెలెబ్రెటీలను కూడా కరోనా పట్టుకొని వదలడం లేదు. మొన్నటికి మొన్న బాలీవుడ్ గాయనీ కనికా కపూర్ ని కరోనా ముప్పుతిప్పలు పెట్టింది. ఆరు సార్లు పాజిటివ్ వచ్చింది. ఏడోసారి ఆమెకు నెగెటివ్ రావడంతో ఆస్పత్రి నుంచి ఇంటికి పంపారు. 20 రోజుల పాటు ఆమె కరోనాపై పోరాడారు.
తాజాగా బాలీవుడ్ నిర్మాత కరీమ్ మొరానీ పరిస్థితి అలానే తయారయ్యేలా ఉంది. రెండోసారి నిర్వహించిన వైద్య పరీక్షల్లో కరీమ్ మొరానీకి కరోనా పాజిటివ్ గానే తేలింది.
తొలుత విదేశాల నుంచి వచ్చిన కరీమ్ కుమార్తెలు జోవా, షాజాలకు కరోనా సోకింది. వారిద్దరి నుంచి తండ్రి కరీమ్ మొరానీకి అంటింది. కూతుళ్లు కోలుకొని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం తండ్రి మాత్రం కరోనాతో పోరాడుతున్నారు.
ముంబైలోని నానావతి ఆస్పత్రిలో కరోనాకు కరీమ్ చికిత్స తీసుకుంటున్నారు. కరీమ్ కు రెండోసారి పాజిటివ్ రావడంతో వారి కుటుంబ సభ్యుల్లో ఆందోళన నెలకొంది. కరీమ్ వయసు 60 ఏళ్లు. ఆ స్టేజీ వారికి కరోనా చాలా ప్రమాదం.. చనిపోయిన వారిలో ఎక్కువ శాతం మంది 60ఏళ్లు నిండిన వారే. ఇప్పటికే కరీంకు రెండు సార్లు హార్ట్ ఎటాక్ వచ్చింది. బైసాస్ సర్జరీ చేశారు. ఇప్పుడు కరోనా అటాక్ కావడం ప్రాణ సంకటంగా మారిందంటున్నారు.
కరీం 1991లో ‘యోధ’ సినిమాతో నిర్మాతగా మారారు. షారుఖ్ ఖాన్ నటించిన ‘చెన్నై ఎక్స్ ప్రెస్’ - దిల్ వాలే చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు. రావన్ - హ్యాపీన్యూఇయర్ లకు అసోసియేట్ ప్రొడ్యూసర్. షారుఖ్ కు అత్యంత సన్నిహితుడిగా పేరుంది.