Begin typing your search above and press return to search.

మోస్ట్ వాంటెడ్ గ‌ర్ల్స్ గ్యాంగ్ ఆస్తుల చిట్టా!

By:  Tupaki Desk   |   27 April 2020 2:30 AM GMT
మోస్ట్ వాంటెడ్ గ‌ర్ల్స్ గ్యాంగ్ ఆస్తుల చిట్టా!
X
టాలీవుడ్ లో ఆ న‌లుగురు ఎలానో .. బాలీవుడ్ లో ఆ న‌లుగురు అలాగ‌!! అయితే అక్క‌డ ఆ న‌లుగురు కిర్రెక్కించే కిక్కు పుట్టించే గ‌ర్ల్స్ అన్న‌మాట‌! త‌మ‌కు న‌చ్చిన‌ట్టు ఉంటారు... తోచిందే చేస్తారు. బిజినెస్ .. న‌ట‌వృత్తి .. బీచ్ బికినీ పార్టీలు .. ఇంకేదైనా అనుకున్న‌దే త‌డ‌వుగా చెల‌రేగిపోతుంటారు. విదేశీ వెకేష‌న్లు అంటే క‌లిసే వెళుతుంటారు. ఇక ఈ గ్యాంగ్ లో చిలిపి క‌న్న‌య్య‌లా ఓ యువ‌హీరో కూడా చేరిపోతుంటాడు.

ఇంత‌కీ ఎవ‌రీ గ్యాంగ్? అంటే.. ఇంకెవ‌రు.. మోస్ట్ వాంటెడ్ గ‌ర్ల్స్ గ్యాంగ్ గా చెప్పుకునే ..కరీనా కపూర్- కరిష్మా కపూర్ సిస్ట‌ర్స్.. మలైకా అరోరా -అమృత అరోరా సిస్ట‌ర్స్ గ్యాంగ్ గురించే ఇదంతా. వీళ్ల‌తో పాటు మ‌రో న‌లుగురైదుగురు ఇండ‌స్ట్రీ స్నేహితులు పార్టీల‌కు జాయిన్ అవుతుంటారు. ఇక వీరి మ‌ధ్య స్నేహం గ‌త ద‌శాబ్ధ కాలంగా నిత్యం హాట్ టాపిక్ గానే న‌లుగుతోంది. ఇందులో మ‌ద‌ర్స్ ఉన్నారు. పిల్ల‌ల ఆల‌నాపాల‌నా చూస్తూనే పార్టీల్ని ఎంజాయ్ చేసేందుకు ఏమాత్రం వెన‌కాడ‌రు. నైట్ లైఫ్ అంటే ప‌డి చ‌స్తారు. కొన్నిసార్లు పార్టీల్లో కొట్టుకున్నారు... తిట్టుకున్నారు.. తాగి తూలి తైత‌క్క‌లాడారు. అందుకే ఈ గ‌ర్ల్స్ గురించి ప‌దే ప‌దే చెప్పుకుంటూనే ఉంటుంది బాలీవుడ్. ఇందులో కరీనా క‌పూర్- క‌రిష్మా క‌పూర్ ముఠా బలమైన బంధాన్ని సాగించ‌డంలోనే కాదు.. విలాసవంతమైన జీవనశైలికి కూడా ప్రసిద్ది. మ‌లైకా - అమృత వీళ్ల‌ను ఫాలో అయిపోతుంటారు. ఆ నలుగురు నటీమణుల ఫ్యాషన్ సెన్స్.. జీవనశైలి.. నికర ఆస్తుల్ని ప‌రిశీలిస్తే షాకిచ్చే నిజాలే తెలిశాయి.

బెబో అలియాస్ కరీనా కపూర్ 2000 లో బాలీవుడ్ లో ఆరంగేట్రం చేసింది. బాలీవుడ్ లో స‌క్సెస్ ఫుల్ న‌టిగా పాపుల‌రైంది. టాప్ ఎ-లిస్ట్ హీరోయిన్ల జాబితాలో ఈ పేరు ఎప్పుడూ ఉంటుంది. ప్రఖ్యాత కపూర్ కుటుంబం నుండి వచ్చింది. నవాబుల కుటుంబానికి చెందిన సుకుమారి అయినా తన కుటుంబం పేరును బెబో ఎప్పుడూ ఉపయోగించలేదు. 39 ఏళ్ల ఈ నటి వ‌రుస‌గా సినిమాల్లో న‌టిస్తూనే బ్రాండ్ ప్ర‌మోష‌న్ లోనూ ఫుల్ బిజీ. సోనీ- హెడ్ & షోల్డర్స్- లాక్మే- ప్రీగా న్యూస్- మాగ్నమ్ ఐస్‌క్రీమ్ వంటి కొన్ని ప్రముఖ బ్రాండ్ ‌లకు బెబో ప్ర‌చార‌క‌ర్త‌. ఒక్కో ఎండార్స్‌మెంట్‌కు 6 కోట్లు అందుకుంటోంది. సుమారు 15 బ్రాండ్ల నుంచి వంద కోట్ల ఆదాయం ఆర్జిస్తోంది. ఇక సినిమాల‌కు ఒక్కో క‌మిట్ మెంట్ కి 10 కోట్లు అందుకుంటోంది.

కరీనా కపూర్ ఖాన్ గురించి చెప్పుకుంటూ వెళితే ఇంకా చాలా ఘ‌న‌త ఉంది. `వాట్ ఉమెన్ వాంట్` అనే రేడియో షోను నిర్వహించడానికి బెబో ఇష్క్ ఎఫ్ఎ.మ్ తో కలిసి పనిచేసింది. అది స‌క్సెసైంది. న్యూయార్క్ ఫెస్టివల్స్ రేడియో అవార్డులలో `బెస్ట్ టాక్ షో హోస్ట్` కోసం నామినేషన్ సంపాదించింది. కరీనా కపూర్ ముంబై- ఫార్చ్యూన్ హైట్స్ ‌లోని 4 బిహెచ్ ‌కె అపార్ట్ మెంట్ యజమాని. బాంద్రాలో రూ .48 కోట్ల విలువైన ఇల్లు ఉంది. అక్కడ ఆమె తన భర్త కొడుకు థైమూర్ తో కలిసి నివసిస్తోంది. అలాగే రూ .33 కోట్ల విలువైన స్విట్జర్లాండ్ లోని జిస్టాడ్ లో ఓ సొంత‌ ఇంటిని కలిగి ఉంది. మెర్సిడెస్ బెంజ్ ఎస్ క్లాస్- ఆడి క్యూ 7- రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎస్యువి - లెక్సస్ ఎల్ఎక్స్ 470 తో సహా ర‌క‌ర‌కాల దేశాల నుంచి డిజైన‌ర్ కార్ల‌ను క‌లిగి ఉంది. క‌రీనా నికర ఆస్తుల‌ విలువ 50 మిలియ‌న్ డాల‌ర్లు.

కపూర్ వంశం నుంచి బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన తొలి అమ్మాయి కరిష్మా కపూర్. పరిశ్రమలో ఒక ప్రముఖ నటిగా ఎదిగి.. ఎన్నో చిరస్మరణీయ పాత్రలలో నటించింది. సినిమాల్లో శృంగార పాత్రలతో అగ్గి రాజేసిన నాయిక‌గానూ పేరుంది. సినీ పరిశ్రమలో చాలా మంది ప్రతిభావంతులైన నటీమణులలో లోలోకి ఒక సీజ‌న్ ఉంది. ఆమె సినీ జీవితంలో అనేక అవార్డులతో పాటు రివార్డుల్ని అందుకుంది. కరిగ్మా కెల్లాగ్స్- డానోన్- గార్నియర్- మెక్కెయిన్- కాలిఫోర్నియా ఆల్మాండ్- అరోమాజ్- ఓడోనిల్ మరెన్నో బ్రాండ్లకు ప్ర‌చారం చేస్తోంది. మెర్సిడెస్ బెంజ్- ఆడి - బిఎమ్‌డబ్ల్యూ స‌హా ప‌లు లగ్జరీ కార్లను కూడా కలిగి ఉంది. కరిష్మా కపూర్ నికర విలువ సుమారు 12 మిలియన్ డాల‌ర్లు.

`చయ్య చయ్య` గాళ్ మలైకా అరోరా బాలీవుడ్ ఐటమ్ సాంగ్స్ క్వీన్ గా వెలిగిపోయింది. చాలా సినిమాల్లో నటించనప్పటికీ ఆమెకు అభిమానుల ఫాలోయింగ్ అధికం. ఫ్యాషన్ ఔత్సాహికురాలు... ఫిట్ ‌నెస్ ప్రమోటర్. మున్నీ బద్నామ్.. అనార్కలి డిస్కో చాలీ.. గుర్ నాల్ ఇష్క్ మిత్తా .. మరెన్నో పాపుల‌ర్ ఐటమ్ సాంగ్స్ ‌తో పేరు.. అభిమానం సంపాదించింది. స్పాన్సర్‌షిప్ ఒప్పందాలలో హీరో- లక్స్- జాండు బామ్ - స్ట్రీక్స్ హెయిర్ కలర్ వంటి అనేక బ్రాండ్లు ఉన్నాయి. ఒక్కో ఐటెమ్‌ నంబ‌ర్ కు 1.75 కోట్లు వసూలు చేస్తుంది. మలైకా ఓ విలాసవంతమైన బంగ్లాలో సౌకర్యవంతమైన జీవితాన్ని గడుపుతోంది. ఆమె కార్ల‌లో BMW 7 సిరీస్ .. రేంజ్ రోవర్ ఉన్నాయి. ఆమె నికర విలువ 10 మిలియన్ డాల‌ర్లు.

మలైకా చెల్లెలు.. అమృత అరోరా బెబో ముఠాకు చెందిన మరో ఫ్యాషనిష్ఠా. ఫర్దీన్ ఖాన్ తో కలిసి 2002 చిత్రం `కిత్నే డ‌ర్ కిత్నే పాస్` తో సినీ కెరీర్ ని ప్రారంభించింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద‌ విజయవంతం కాలేదు. రెండు హిట్స్ రెండు మిస్సింగుల తర్వాత.. మల్టీస్టారర్ చిత్రం `అవరా పాగల్ దీవానా`తో స‌క్సెస్ అందుకుంది. అమృత కెరీర్ చాలా అస్థిరంగా ఉన్నా.. `గర్ల్‌ఫ్రెండ్` చిత్రంలో అద్భుతంగా న‌టించి మెప్పించింది. ఇందులో ఆమె సప్నా అనే వివాదాస్పద పాత్ర లో జీవించింది. ఓం శాంతి ఓం- స్పీడ్- రెడ్: ది డార్క్ సైడ్- కంబక్త్ ఇష్క్ - గోల్‌మాల్ రిటర్న్స్ వంటి కొన్ని సినిమాల్లో మ‌లైకా కొన్ని ప్రత్యేక పాత్రలు పోషించింది.

మార్చి 2009లో వ్యాపారవేత్త షకీల్ లడక్ ని పెళ్లాడింది అమృత అరోరా. ముంబైలో తన కుటుంబంతో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతోంది. ల‌గ్జ‌రీ కార్ల‌తో సెల‌బ్రేష‌న్ చేయ‌డం కొత్తేమీ కాదు. నటన - మోడలింగ్ లో ఆమె సంపాద‌న అంతంత మాత్ర‌మే అయినా ఆస్తులు బాగానే ఉన్నాయి. అమృత అరోరా నికర ఆస్తి విలువ 5 మిలియన్ డార్లుగా ఉంటుందని అంచనా.