Begin typing your search above and press return to search.

స్టార్ హీరోయిన్ మూడున్నర నెలల ప్రెగ్నెంట్

By:  Tupaki Desk   |   1 Jun 2016 4:31 PM IST
స్టార్ హీరోయిన్ మూడున్నర నెలల ప్రెగ్నెంట్
X
ఒక స్టార్ హీరోయిన్ కు కాస్త వయసు మీద పడగానే ఆమె పెళ్లెప్పుడు అన్నది చర్చనీయాంశం అవుతుంది. తీరా పెళ్లి చేసుకున్నాక ఆమె తల్లయ్యేదెప్పుడు అన్నదానిపై డిస్కషన్ మొదలవుతుంది. అందులోనూ బాలీవుడ్ మీడియా వాళ్లకు ఇలాంటి వ్యవహారాలపై బాగా ఆసక్తి. ఈ విషయంలో పదే పదే అందాల తారల వెంట పడి విసిగిస్తుంటారు. ఐశ్వర్యారాయ్ ఈ వేధింపులు తట్టుకోలేక.. నా ప్రెగ్నెన్సీ గురించి మీకెందుకు? అంటూ ఓ ఇంటర్వ్యూలో విరుచుకుపడింది. అయినా ముంబయి మీడియా వాళ్లలో ఏ మార్పూ రాలేదు. లేటెస్టుగా వాళ్ల దృష్టి కరీనా కపూర్ మీద పడింది. మూడేళ్ల కిందట సైఫ్ అలీ ఖాన్ ను పెళ్లి చేసుకున్న నాటి నుంచి ఆమె ప్రెగ్నెన్సీ గురించి ఎప్పటికప్పుడు రూమర్లు వినిపిస్తూనే ఉన్నారు.

తాజాగా ఓ ప్రముఖ పత్రికలో కరీనా ప్రెగ్నెన్సీ గురించి పెద్ద కథనం ప్రచురితమైంది. ప్రస్తుతం కరీనా గర్భవతి అని.. అందుకే రిలాక్స్అవడం కోసం భర్త సైఫ్ అలీ ఖాన్ తో కలిసి లండన్ పర్యటనకు వెళ్లి వచ్చిందని అందులో పేర్కొన్నారు. కరీనా ప్రస్తుతం మూడున్నర నెలల గర్భవతి అని కూడా ఈ కథనంలో పేర్కొనడం విశేషం. ఇంత కచ్చితంగా చెబుతున్నారంటే ఈసారి కరీనా ప్రెగ్నెన్సీ న్యూస్ కన్ఫమే అయి ఉంటుందని భావిస్తున్నారు. కరీనా కొత్త సినిమా ‘ఉడ్తా పంజాబ్’ జూన్ 17న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దీని ప్రమోషన్ల కోసం కరీనా బయటికి రాక తప్పదు. మరి 4 నెలల ప్రెగ్నెన్సీ అంటే ఆమెను చూస్తే ఆ సంగతి స్పష్టంగా తెలిసిపోతుంది. కాబట్టి ఈ ప్రెగ్నెన్సీ రూమర్ వాస్తవమో కాదో తేలిపోతుందిలెండి.