Begin typing your search above and press return to search.

కొడుకును ప్ర‌పంచానికి చూపించిన క‌రీనా క‌పూర్‌..!

By:  Tupaki Desk   |   8 March 2021 10:07 AM GMT
కొడుకును ప్ర‌పంచానికి చూపించిన క‌రీనా క‌పూర్‌..!
X
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ క‌రీనా క‌పూర్ రెండోసారి ప్ర‌స‌వించిన విష‌యం తెలిసిందే. రెండోసారి కూడా కుమారుడికి జ‌న్మనిచ్చిన బెబో.. తొలిసారిగా త‌న కుమారుడి ఫొటోను ప్ర‌పంచానికి చూపించింది. ఈ మేర‌కు సోమవారం ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.

గ‌తంలోనే ప్ర‌స‌వించిన క‌రీనా.. అంత‌ర్జాతీ మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా కొడుకు ఫొటోను రిలీజ్ చేయ‌డం విశేషం. ఈ ఫొటోకు మంచి క్యాప్ష‌న్ కూడా ఇచ్చింది బెబో. అభిమానులకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ.. ‘‘మహిళలు చేయలేనిది ఏమీ లేదు. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు’’ అని రాసుకొచ్చింది.

ఈ ఫొటోలో ఒక చేత్తో తన బిడ్డను పట్టుకున్న కరీనా.. మ‌రో చేత్తో సెల్ఫీ తీసుకొని అప్‌లోడ్ చేసింది. ఈ ఫొటోకు కామెంట్ల వ‌ర్షం కురుస్తోంది. కరీనా క‌జిన్‌, నటి సోహా అలీ ఖాన్ ‘‘యు ఆర్ ఎ రాక్, లవ్ యు’’ అని కామెంట్ చేసింది.

సైఫ్ అలీ ఖాన్ ను పెళ్లి చేసుకున్న కరీనా.. రెండో బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది. ఫిబ్రవరి 21 న ముంబైలోని ఓ ఆసుప‌త్రిలో డెలివ‌రీ అయ్యింది క‌రీనా. ఈ దంపతులకు తైమూర్ అనే నాలుగేళ్ల కుమారుడు ఉన్నారు.